తెలుగు మెగాస్టార్ చిరంజీవి సైరా తర్వాత స్పీడ్ పెంచారు. సైరా కోసం మూడేళ్ల టైమ్ తీసుకోవటంతో ఇక సినిమాల్లో వేగం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త సినిమాలను త్వరగా పూర్తి చేసి త్వర త్వరగా విడుదల చేయాలని పని చేస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన కొరటాల మూవీ ఈనెలలో షూటింగ్ కు వెళ్లనుంది. ఈ సినిమాకి భారీ బడ్జెట్ కేటాయించారు మేకర్స్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 140 కోట్ల బడ్జెట్ కేటాయించారని లేటెస్ట్ సమాచారం.

 

 

పాన్ ఇండియా కంటెంట్ సబ్జెక్ట్ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. చిరంజీవి సినిమా అంటే భారీ బడ్జెట్ సహజం. కానీ సైరాకు పెట్టిన బడ్జెట్ ఈ సినిమా కంటే రెట్టింపు. ఇప్పుడు అంతకు సగం బడ్జెట్ లోనే సినిమాను రూపొందించి తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో రిలీజ్ చేయాలని నిర్మాతల్లో ఒకరైన రామ్ చరణ్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అందుకే ఈ సినిమాకు ఈ సినిమాకు అతుల్ – అజయ్ ను బాలీవుడ్ నుంచి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. పక్కా స్క్రిప్ట్ తో కొరటాల శివసినిమా కోసం చాన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. సైరా సందడి పూర్తవ్వడంతో మెగాస్టార్ ఈ సినిమాపైనే పూర్తి దృష్టి సారించినట్టు తెలుస్తోంది. సినిమాను వేగంగా పూర్తి చసి వచ్చే వేసవిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట మెగాస్టార్.

 


చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చేస్తున్న మూడో సినిమా ఇది. 150వ సినిమా రీమేక్ అయితే, 152 పిరీయాడికల్ మూవీ. 152వ మూవీ కొత్త కథ. కాబట్టి ఈ మూడు డిఫరెంట్ జోనర్ల సబ్జెక్ట్స్ అని చెప్పక తప్పదు. ఆ రెండు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న చిరంజీవి కొత్త కథతో ఏం చేస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: