స్మార్ట్ ఫోన్ ప్రతి వ్యక్తి చేతిలోకి అందుబాటులోకి రావడంతో సెలెబ్రెటీల జీవితాలు వారికి తెలియకుండానే రోడ్డు మీద పడిపోతున్నాయి. ఒక సెలెబ్రెటీ పై నెగిటివ్ కామెంట్స్ చేయడం గాసిప్పులు ప్రచారం చేయడం ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్న సెలెబ్రెటీలకు కనిపించని విలన్స్ గా మారుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా రకుల్ ప్రీత్ రానా లను లింక్ చేస్తూ కొన్ని మీడియా వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తలను చూసి ఇండస్ట్రీ వర్గాలు కూడ షాక్ అవుతున్నాయి. 

ప్రస్తుతం రానా కొన్ని అనారోగ్య కారణాల రీత్యా సినిమాలకు దూరంగా ఉంటూ ఈ మధ్యనే అమెరికా నుండి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. తాను మళ్ళీ సినిమాలలో నటించడానికి మరికొంత సమయం కావాలని స్వయంగా రానా తన దర్శక నిర్మాతలను అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో రానా రకుల్ ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది అంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు సృష్టిస్తున్నాయి. 

ఈ వార్తల పై రకుల్ ఒక ఇంటర్వ్యూలో స్పందించింది. తన ఇల్లు రానా  ఇంటి పక్కనే ఉన్నంత మాత్రాన తమ మధ్య ఎఫైర్ ఉంది అంటూ వార్తలు వ్రాస్తే ఎలా అంటూ గగ్గోలు పెడుతోంది. వాస్తవానికి తాను ఇప్పటి వరకు రానాతో ఒక్క సినిమాలో కూడ నటించని విషయాలను పట్టించుకోరా అంటూ రకుల్ మీడియాకు ఎదురు ప్రశ్నిస్తోంది. 

ఒకప్పుడు రానా త్రిషతో ఆ తరువాత శ్రియతో బాగా సన్నిహితంగా ఉన్న విషయాలు వాస్తవం. అయితే ఇప్పుడు ఆ లిస్టులోకి రకుల్ వచ్చి చేరడంతో ఇప్పటికే రానా అనారోగ్యం వార్తల గురించి క్లారిటీ ఇవ్వలేక తిప్పలు పడుతున్న సురేశ్ బాబుకు ఇప్పుడు మరో కష్టం వచ్చి పడిందా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. అయితే రూమర్లను విపరీతంగా ఎంజాయ్ చేసే రానాకు ప్రస్తుతం ఈ ఖాళీ సమయంలో ఈ వార్తలు మంచి జోష్ ను ఇస్తాయి అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: