సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. పిల్లా పెద్దా ఇంటిల్లిపాదీ ఒక్క చోట చేరి చేసే హడావుడి హద్దులు దాటుతుంది. మరి సంక్రాంతి ఉత్సాహాన్ని మరింతగా పెంచేందుకు వచ్చే సినిమాలు కూడా హుషార్ గానే ఉంటాయి. ఈసారి సంక్రాంతి కూడా కోడి పందేల జోరునే తలపిస్తోంది. ఓ వైపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మరో వైపు స్టైలిష్ స్టార్ బన్నీ పోటా పోటీగా దూసుకువస్తున్నారు. ఇద్దరి సినిమాల పైనా మంచి అంచనాలే ఉన్నాయి.


ఈ ఇద్దరి సినిమాలను ఇద్దరు టాప్ డైరెక్టర్లే తీస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ బన్నీ మూవీ అల వైకుంఠపురంలో  డైరెక్టర్. ఆయన మూవీ అంటే చాలు సంక్రాంతి సందడిగానే ఉంటుంది. మరో వైపు ఈ సంక్రాంతికి హిట్ కొట్టిన అనిల్ రావిపూడి మహేష్ బాబుతో తీస్తున్న సరిలేరు నీకెవ్వరు. ఈ రెండు సినిమాలు పెద్ద హిట్లు అవుతాయని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. లెక్కలు కూడా కడుతున్నారు.


ఇదిలా ఉండగా ఈ రెండు సినిమాలకు ఒక పోలిక ఉంది. ఈ సినిమాల ద్వారా ఇద్దరు సీనియర్ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు మూవీ ద్వారా విజయశాంతి 14 ఏళ్ళ తరువాత పరిచయం అవుతోంది.  ఆమె 2005లో నాయుడమ్మ మూవీతో సినిమాలు చేయడం ఆపేశారు. ఇపుడు మళ్ళీ మహేష్ బాబు మూవీతోనే ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక మహేష్ బాబు బాబు బాలనటుడిగా చేసిన కొడుకు దిద్దిన కాపురంలో కూడా విజయశాంతి తల్లిగా వేశారు. దాంతో ఆ మ్యాజిక్ కాంబో ఈ మూవీలో కనిపించడం ఒక ఇంటెరెస్టింగ్ పాయింట్.


మరో వైపు బన్నీ మూవీ ద్వారా టబు రీ ఎంట్రీ ఇస్తున్నారు. టబు కూడా ఈ మధ్యన సినిమాలు చేయడం లేదు. చాలా కాలం తరువాత ఆమె చేస్తున్న మూవీ ఇదే కావడంతో టబు ఎలా చేస్తుంది. ఆమె రోల్ ఏంటి అన్న ఇంటెరెస్ట్ అపుడే పెరిగిపోతోంది. టబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా క్రేజీగా ఉంది. దాంతో బన్నీ మూవీకి టబు ప్లస్ అవుతుందని అంటున్నారు. టోటల్ గా చూసుకుంటే సీనియర్ భామల సమరమే ఈ సారి సంక్రాంతి అనాల్సివస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: