అరవింద సమేత వీర రాఘవ విడుదలైన తరువాత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాని అల్లు అర్జున్‌తో తీస్తారు అని అన్నారు. ఈ చిత్రం బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్, నుష్రత్ భారుచా నటించిన లవ్ రంజన్ చిత్రం ‘సోను కే టిటు కి స్వీటీ’ కి రీమేక్ ఉంటుంది అని చెప్పారు.కానీ ప్రస్తుతం, అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి 2020 లో థియేటర్లలోకి రానున్న అలా వైకుంఠపురంలో సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు 'సోను కే టిటు కి స్వీటీ' రీమేక్‌లో దగ్గుబాటి రానా నటించబోతున్నారని వినిపిస్తోంది. .


‘సోను కే టిటు కి స్వీటీ’ రీమేక్ వెర్షన్ దగ్గుబాటి కాంపౌండ్ లోకి వెళ్ళింది,సురేష్ బాబు దీనిని దగ్గుబాటి రానాతో రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నట్లు కొని విశ్వసియన వర్గాలు చెబుతున్నాయి. అన్ని కూడా  అనుకున్నట్లు జరిగితే, ‘సోను కే టిటు కి స్వీటీ’ తెలుగు రీమేక్‌లో కార్తీక్ ఆర్యన్ పాత్రను రానా దగ్గుబాటి తిరిగి పోషించనున్నారు. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించడానికి ఫలక్నుమా దాస్ ఫేమ్ విశ్వక్ సేన్ ను తీసుకోవాలి అనుకుంటున్నారు.


బాలీవుడ్ లో లవ్ రంజన్ తీసిన చిత్రం ‘సోను కే టిటు కి స్వీటీ’ కథ ఒకరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఇద్దరు చిన్ననాటి స్నేహితుల స్నేహాన్ని ఎలా పరీక్షిస్తారు అనేది  కథ . బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ, ‘సోను కే టిటు కి స్వీటీ’ చిత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమా అని విమర్శించబడింది, ఇది తెలుగులో ఎలా రూపు దిద్దుకుంటుందో చూడాలి.


ప్రస్తుతం సాయి పల్లవితో  కలిసి విరాట పర్వంలో రానా దగ్గుబాటి కనిపిస్తున్నాడు.మరోవైపు, రానా దగ్గుబాటి ఇటీవల విడుదల అయిన హిందీ చిత్రం హౌస్‌ఫుల్ 4 విజయంతో ఆనందంలో ఉన్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: