మహేష్ మేనల్లుడు ఫిలిం ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వాస్తవానికి దిల్ రాజ్ నిర్మాణంలో మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ ఫిలిం ఎంట్రీ ఉంటుంది అని అందరు భావించారు. అయితే కొన్ని అనుకోని కారణాల రీత్యా ఈ ప్రాజెక్ట్ నుండి దిల్ రాజ్ వెనక్కు వెళ్లిపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు మరింత రెట్టించిన ఉత్సాహంతో గల్లా అశోక్ మొట్టమొదటి సినిమా ఈ నెల 10వ తారీఖున చాల ఘనంగా జరగబోతోంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఫిలిం స్టూడియోలో ఈ మూవీ ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు చేసారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నాడు. అదేవిధంగా ఈ మూవీకి జిబ్రాన్ సంగీత దర్సకత్వం వహించబోతున్నాడు. ముంబాయ్ కి చెందిన ఒక మోడల్ ను ఈ మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ మూవీని మహేష్ సోదరి గల్లా జయదేవ్ భార్య పద్మావతి అమర్ రాజ మీడియా బ్యానర్ పై నిర్మస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈ మూవీ స్క్రిప్ట్ ను చాల పక్కాగా తాయారు చేసారు అని వార్తలు వస్తున్నాయి. ఈ స్క్రిప్ట్ పూర్తిగా చదివి మహేష్ ఓకె చేయడంతో ఈ మూవీ పట్టాలు ఎక్కబోతున్నట్లు సమాచారం. 

ఇప్పటికే అశోక్ అమెరికాలోని ఒక ప్రముఖ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటనకు డాన్స్ కు సంబంధించిన ఒక కోర్స్ పూర్తి చేసి తన మేనమామ మహేష్ వారసత్వం కొనసాగించడానికి తన వంతు గట్టి ప్రయత్నాలు చేయబోతున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్ హీరోల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడిన నేపధ్యంలో ఈ వారసత్వ హీరోకు ఎలాంటి స్పందన ఉంటుంది అన్న విషయం రాబోబే కొత్త సంవత్సరంలో తేలిపోతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: