వివాదాత్మక సినిమాలు తీసి అందరి దృష్టిని మరియు పాపులర్ అయ్యే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల నిర్మించిన  చిత్రం లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తనకు తెలసిన తాను తీయాలకున్న రీతిలో తీసి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర మంచి మాటనే తెచ్చుకుంది. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల సమయం లో వచ్చిన ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో   రెండు రాష్ట్రాల  రాజకీయాలలో ఒక్క సరిగా సంచలనం సృష్టించాడు.

ఇదంతా ఒక ఎత్తు అయితే తెలంగాణలో విడుదల అవ్వడం ఆంధ్రప్రదేశ్ లో విడుదలను ప్రభుత్వమే నిలిపివేయడం తో ఒక నాటకీయ పరిణామం ఏర్పడింది. అయితే ఏ విషయాన్నైనా ఎవరి జీవితంపై నైనా సినిమా తీయాలంటే ఎలాంటి పక్షపాతం లేకుండా తీయగల దిట్ట వర్మ. మొదట ఈ చిత్రాన్ని బాలకృష్ణ కథానాయకుడిగా తీయాలని నిర్ణయంచుకున్నాడు కానీ తీసే సమయం లో బాలకృష్ణతో ఏకాభిప్రాయం కుదరక మరియు వివాదాలు లేని సినిమా నేను తేయానని బయటికి వచ్చి కొత్త తరం నటులతో  చాల తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించాడు. విడుదల తరువాత మంచి లాభాన్ని నిర్మాత కు కట్టబెట్టాడు వర్మ. 
సినిమా ఇచ్చిన తృప్తి మరియు విజయం తో  రామ్ గోపాల్ వర్మ మరో ఆత్మ కథని కథగా ఎంచుకొని సినిమా చేయాలనీ అది తమిళ రాజకీయనాయకురాలు మరియు జైలు జీవితాన్ని అనుభవిస్తున్న  శశికళ బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాకు పేరుతో పాటు  లవ్ ఈజ్ డేంజరస్లీ పొలిటికల్  అనగా ప్రేమ అనేది రాజకీయాలకన్నా డేంజర్  అంటూ ఒక  క్యాప్షన్ కూడా ఇచ్చాడు. జయలలిత స్నేహితురాలుగా, చిన్నమ్మగా పిలవబడే శశికళ,  జయలలిత జీవితం పైన  ప్రభావితం చేసిన అంశాలను పరిగణలోకి తీసుకొని జయలలిత ఆసుపత్రి లో చికిత్స సమయం లో జరిగిన పరిణామాలను ఈ చిత్రం లో చూపిస్తాడని సమాచారం.

మొత్తానికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి వివాదాత్మక  కథా చిత్రం తర్వాత అంతకు మించిన వివాదాలున్న శశికళ, జయలలిత స్నేహం మరియు జరిగిన విషయాలను  శశికళ బయోపిక్‌ను రామ్ గోపాల్ వర్మ మొదలుపెడుతున్నారు.అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ లో కొత్త వాళ్లతో తీసినట్టే  ఇపుడు తీయబోయే శశికళ బయోపిక్‌ను కూడా కొత్త వాళ్లతోనే తెరకెక్కించే అవకాశమే ఎక్కువగా ఉంది అని అంచనా. అలాగే జయలలిత జీవితంలో శశికళ ప్రవేశించిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను ఈ సినిమాలో చూపెట్టబోయే అవకాశం ఎక్కువగా ఉంది.  మరి శశికళ  బయోపిక్  తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: