ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కి ఎంత పాపులారిటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ లో బాగా ఫేమస్ అయిన కమెడియన్స్ అందరికీ తెగ సినిమా  వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే జబర్దస్త్ లోకి ఒక కంటెస్టెంట్ గా వచ్చి  ఆ తర్వాత టీం లీడర్ గా మారిన సుడిగాలి  సుధీర్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వచ్చిన అవకాశాన్ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకున్న కమెడియన్ ఎవరు అంటే అదొక సుధీర్ అనే చెప్పాలి. హీరోల రేంజిలో క్రేజ్ సంపాదించి  దూసుకుపోతున్నాడు కమీడియన్ సుడిగాలి సుదీర్ . ఒక కమెడియన్ గానే కాకుండా మెజీషియన్ గా డాన్సర్ గా యాంకర్ గా ఇలా ప్రతి దాంట్లో సత్తా చాటి  మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు సుధీర్. ఇప్పుడు వరకు సుధీర్ కి వచ్చినంత ఫాలోయింగ్ జబర్దస్త్ లో ఏ కమెడియన్ కూడా లేదంటే అతిశయోక్తి కాదు. 



 ఇప్పటివరకు సుధీర్ ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించగా ... ఇక ఇప్పుడు తాజాగా హీరో అవతారమెత్తాడు. సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న మొదటి చిత్రం సాఫ్ట్ వేర్ సుధీర్. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయిపోయింది. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశం లో సుడిగాలి సుదీర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పదేళ్ల క్రితం తను ఫిలింనగర్ కు వచ్చానని... అప్పుడు ఫిలిం ఛాంబర్ ని బయట నుంచి చూసి ఎంతో మురిసి పోయే వాడిని అని సుదీర్ తెలిపాడు . ఈరోజు ఫిలింఛాంబర్లో నిలబడి తన సినిమా గురించి మాట్లాడుతుండటం  ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. ఈ ఏడాది మార్చి 20వ తేదీ తన జీవితంలోని ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాడు సుదీర్. 



 మార్చి 20వ తేదీనాడు  హీరోగా తన  ప్రయాణం మొదలైంది అని తెలిపాడు. మార్చి 20వ తేదీనాడు సాఫ్ట్ వేర్  సుదీర్ సినిమా షూటింగ్... అదేరోజు రాత్రి 3మంకీస్ షూటింగ్ మొదలైందని  సుధీర్ తెలిపాడు. తన కెరీర్ లో మొదటి సినిమానే పెద్ద పెద్ద టెక్నీషియన్స్ తో  చేస్తానని అసలు కలలో కూడా అనుకోలేదని సుధీర్ తెలిపాడు. తనను నమ్మి  ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు పులిచర్ల రాజశేఖర్ రెడ్డి.. నిర్మాత శేఖర్ రాజులకు ధన్యవాదాలు తెలిపాడు. ఇటీవలే మలేషియాలో  చిత్రీకరించిన పాటలు సహా చిత్రం మొత్తం అద్భుతంగా వచ్చింది అంటూ సుధీర్ తెలిపాడు.తాను  నటించిన సాఫ్ట్ వేర్ సుదీర్   సినిమా డిసెంబర్ మొదటి వారంలో విడుదల అవ్వబోతున్నట్లు చెప్పుకొచ్చాడు సుడిగాలి  సుధీర్.


మరింత సమాచారం తెలుసుకోండి: