ఆర్ కే రోజా సినిమాల్లో కి ఇలా అడుగు పెట్టిందో లేదో కానీ ఆమెకి విపరీతమైన సినీ అవకాశాలు తన్నుకొచ్చాయి. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ప్రఖ్యాత గాంచిన రోజా... అందరు టాప్ హీరోస్ సరసన నటించింది. అసలు రోజా ఇంత ఫేమస్ అవడానికి ముఖ్య కారకుడు ప్రేమ తపస్సు దర్శకుడైన శివప్రసాద్‌. అవునండి! ఆమెకు సినీ జీవితాన్ని ప్రసాదించింది శివప్రసాదే. ఆయన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, కమెడియన్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ రంగంలో వెలుగొందారు. ఇంతగా సినీ రంగంతో అనుబంధం ఉన్న ఈయన ప్రేమ తపస్సు సినిమాలో రోజా కి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చి ఆమె నటన ప్రతిభను సినీ ఇండస్ట్రీ కి రుచి చూపించారు. ఆ సినిమా తర్వాత నుండి రోజా తన సినీ చరిత్రలో వెనుతిరిగి చూడలేదు. 


ఇక రోజా కి గురువైన శివప్రసాద్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు ఆయన అప్పట్లో ఓ తెలుగు దేశం పార్టీ నేత. ఇతని సహాయంతోనే రోజా తన సినీ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే తెలుగు దేశం పార్టీ లో జాయిన్ అయింది. ఆ తర్వాత ఏవో కొన్ని కారణాల వల్ల వై.యస్.జగన్ నేతృత్వంలోని  వైయస్ఆర్‌సీపీలో జాయిన్ అయింది. ఆమె రెండో సారి వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికవడం తెలిసిన విషయమే. ఇలా ఆమె తన జీవితం లో అంచెలంచలుగా ఎదిగారు. ప్రస్తుతం ఆమె జబర్దస్త్ కామెడీ షో కి న్యాయమూర్తిగానూ, అవకాశమొచ్చినపుడల్లా సినిమాల్లోనూ.. రాజకీయాలలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఏపీఐఐసీ ఛైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్న రోజాకు నెలకు రూ.3.82 లక్షల వేతనం వస్తుంది. ప్రభుత్వం నుంచి నెలకు రూ. 2 లక్షలు వస్తుంది. 


ట్రావెలింగ్ అలవెన్సు కింద రూ.60,000 , హౌస్ రెంట్ అలవెన్సు కింద 50,000...పర్సనల్ అసిస్టెంట్స్ కి జీతం ఇచ్చేందుకు రూ.70,000 ప్రభుత్వం కేటాయించింది. మొబైల్ ఫోన్ ఛార్జీలకు రూ.2,000 ఇస్తుంది. జబర్దస్త్ షో లో ఒక్కో ఎపిసోడ్ కి రూ. 2 లక్షలు తీసుకుంటుందని సమాచారం. మొత్తం కలిపితే ఆమె నెలకు రూ. 23 లక్షల పైనే సంపాదిస్తుందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: