నందమూరి బాలకృష్ణ... ఈ పేరుకు టాలీవుడ్ లో మంచి ఇమేజ్  ఉంది. పవర్ఫుల్ హీరోయిజం ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు నందమూరి బాలకృష్ణ. ఇక ఫ్యాన్స్ ఎవరైనా తప్పు చేశారు అనుకోండి వాళ్ళ పై విరుచుకుపడుతుంటారు  నందమూరి బాలకృష్ణ. ఇక నందమూరి ఫాన్స్ కూడా బాలకృష్ణ ని ఎవరైనా కామెంట్ చేస్తే పవర్ ఫుల్ గానే రియాక్ట్ అవుతుంటారు. తాజాగా బాలకృష్ణ పై ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ఏకంగా బాలకృష్ణ డాన్స్ పైన కామెంట్ చేసాడు. అంత ధైర్యం ఎవరికి ఉంది అనుకుంటున్నారా...  బాలకృష్ణ పై కామెంట్ చేసింది ఎవరో కాదు  తమిళ కమెడియన్. 



 తమిళ స్టాండ్ కమెడియన్ బాబు బాలయ్యపై సెటైర్లలు   వేసాడు. తమిళనాట మంచి ఫాలోయింగ్ ఉన్న కమీడియన్ బాబు... సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ కామెడీ పండిస్తూ ఉంటాడు. సెలబ్రిటీల అభిమానుల  మనసు నొప్పించకుండా సెటైర్లు వేస్తూ ఉంటాడు కమెడియన్ బాబు. ఇక ఇప్పుడు కూడా బాలయ్య మీద సెటైర్లు వేసి కాస్త కామెడీ పంచూదాం  అనుకున్నాడు కానీ అది కాస్త మిస్ ఫైర్  అయిపోయింది. తాజాగా ఆయన కె.జె.ఏసుదాస్ ఎస్పీబాలు లాంటి గొప్ప సింగర్ ని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తూ కామెడీ చేసారూ . తన మాటలకి కాస్త చతురత ఇంకాస్త వ్యంగ్యాన్ని జోడించి కామెడీ చేస్తూ ఉంటాడు స్టాండ్ అప్  కమిడియన్  బాబు. 



 ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో బాలయ్య ను  టార్గెట్ చేసి  ఆయన డాన్స్ పై సెటైర్లు వేశాడు. బాలయ్య డాన్స్  చూస్తే మిడ్ నైట్ మసాలా హీరోయిన్లు కూడా భయపడి పారిపోతుంటారు అంటూ  సంచలన వ్యాఖ్యలు చేసాడు తమిళ కమెడియన్ బాబు. డాన్స్ మాస్టర్ లు బాలకృష్ణకు చెప్పింది కాకుండా ఆయన సొంత స్టెప్పులు వేసి  హీరోయిన్లను భయ పెడుతూ ఉంటాడు అంటూ సెటైర్ వేసాడు బాబు. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ అనే పాట తీసుకొని కూని చేశాడు కమిడియన్  బాబు. ఆ పాటలో  ఎస్పీ బాలు వాయిస్  బాగుంటుంది కానీ పిక్చరైజేషన్ చూస్తే మాత్రం చచ్చిపోతారు అంటూ రెచ్చిపోయి మరి  సెటైర్ వేసారు. కమెడియన్ బాబు బాలయ్య పై వేసిన సెటైర్లకు ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత ధైర్యం ఉంటే మా పవర్ఫుల్ బాలయ్యను అంతమాట అంటావ్ అంటూ  ఆడుకుంటున్నారు.



ఇదిలా ఉండగా తమిళ కమెడియన్లు  తెలుగు హీరోలపై  సెటైర్లు వేయడం కొత్తేమీ కాదు... గతంలో కూడా మనోజ్  ప్రభాకర్  అనే  కమీడియన్ మహేష్ బాబు ముఖంలో అసలు ఎక్సప్రెషన్స్ పలకవు  అంటూ వెక్కిరించడం అప్పట్లో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ కమెడియన్ తో ఓ ఆట ఆదుకున్నారు . అంతేకాదండోయ్ ఇండియాలోనే బెస్ట్ మ్యూజికల్ స్టాండప్ కామెడీయాన్  అంటూ ఓ ప్రముఖ సంస్థ కమెడియన్ బాబుకు అవార్డు ప్రకటించడంతో బాలయ్య ఫ్యాన్స్ మరింత మండి పోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: