బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాదు, ప్రపంచ సినిమాకు మనమంతే ఏంటో నిరూపించింది. రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శితమైన మొదటి విదేశీ భాషా చిత్రంగా పేరు గాంచింది. అంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన ఈ సినిమా మరెన్నో రికార్డులు అధిగమించింది. ఈ ఒక్క సినిమాతో ఇండియాలో ఉన్న అన్ని రికార్డులు కుదేలయ్యాయి. అన్ని రికార్డుల మీద తన పేరు లిఖించుకుంది బాహుబలి.


అయితే దక్షిణాది నుండి ఇలాంటి సినిమా వస్తుందని ఉత్తరాది వారు ఏనాడూ ఊహించి ఉండరు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రం కూడా దేశవ్యాప్తంగా విడుదల అయినప్పటికీ, టాక్ పరంగా నెగెటివ్ రావడంతో రికార్డుల వరకు వెళ్ళకుండా ఆగిపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన సైరా సైతం బాహుబలి లాంటి ఇమేజ్ ని క్రియేట్ చేయలేకపోయింది. బాలీవుడ్ నుండి కూడా బాహుబలి ని బీట్ చేయాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి.


అయితే బాహుబలి స్థాయిలో మరో సినిమా రాబోతుందని సమాచారం. అయితే అది కూడా దక్షిణాది ఉంటుందట.  లెజెండరి డైరెక్టర్ మణిరత్నం ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాడట. పొన్నియన్ సెల్వం అనే చిత్రాన్ని బాహుబలి రేంజ్ లో తెరెకెక్కిస్తున్నాడట.ఈ భారీ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటనున్న ఈ మూవీ లాంచింగ్ కి సిద్ధమైంది. 


వచ్చేనెలలో థాయిలాండ్ వేదికగా ఈ భారీ చిత్రాన్ని గ్రాండ్ గా ప్రారంభించనున్నారు. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియెన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చారిత్రాత్మక చిత్రం తెరకెక్కుతుంది. చోళ రాజుల డైనెస్టీలో ఒక రాజు వీరగాధే ఈ చిత్రం అని తెలుస్తుంది. మరి ఈ సినిమా బాహుబలి లాంటి ఇమేజ్ ని క్రియేట్ చేస్తుందా లేదా చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: