టీజర్ లో
రష్మిక నడుము అందాలను ఆస్వాదిస్తూ
నితిన్ వెంట పడటం చూస్తుంటే ఈ
యువ జంట ప్రేక్షకులను అలరించడం పక్కా అని తెలుస్తుంది.
ఛలో సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ కనబరచిన
వెంకీ కుడుముల భీష్మని కూడా అదే విధంగా తెరకెక్కిస్తున్నాడట. ముఖ్యంగా
నితిన్, రష్మికల జోడీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.
స్టార్ హీరోలతోనే కాదు
నితిన్ లాంటి
యువ హీరోతో కూడా భీష్మలో నటిస్తుంది రష్మిక.
రష్మిక తెలుగులోకి తీసుకొచ్చిన వెంకీనే భీష్మని డైరెక్ట్ చేయడంతో మరోసారి ఈ కాంబినేషన్ తప్పకుండా హిట్టు సినిమానే ఇస్తుందని అంటున్నారు. మరి భీష్మ
సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
నితిన్ ఈ సినిమాతో పాటుగా
వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే
సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండిటితో పాటుగా
చంద్రశేఖర్ యేలేటి
సినిమా కూడా లైన్ లో ఉంది.