యువ హీరో నితిన్ హీరోగా ఛలోతో మొదటి సినిమానే సూపర్ హిట్ అందుకున్న సక్సెస్ ఫుల్ డైరక్టర్ వెంకీ కుడుముల డైరక్షన్ లో వస్తున్న సినిమా భీష్మ. ఈ సినిమాలో నితిన్ తో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజైంది. 


టీజర్ లో రష్మిక నడుము అందాలను ఆస్వాదిస్తూ నితిన్ వెంట పడటం చూస్తుంటే ఈ యువ జంట ప్రేక్షకులను అలరించడం పక్కా అని తెలుస్తుంది. ఛలో సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ కనబరచిన వెంకీ కుడుముల భీష్మని కూడా అదే విధంగా తెరకెక్కిస్తున్నాడట. ముఖ్యంగా నితిన్, రష్మికల జోడీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.


యువ హీరోలంతా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తుంటే ఈమధ్య నితిన్ చాలా వెనుకపడ్డాడు. శ్రీనివాస కళ్యాణం తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న నితిన్ భీష్మతో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఫస్ట్ లుక్ టీజర్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో వరుస స్టార్ ఛాన్సులు అందుకుంటుంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్న రష్మిక ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తుందట.


స్టార్ హీరోలతోనే కాదు నితిన్ లాంటి యువ హీరోతో కూడా భీష్మలో నటిస్తుంది రష్మిక. రష్మిక తెలుగులోకి తీసుకొచ్చిన వెంకీనే భీష్మని డైరెక్ట్ చేయడంతో మరోసారి ఈ కాంబినేషన్ తప్పకుండా హిట్టు సినిమానే ఇస్తుందని అంటున్నారు. మరి భీష్మ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. నితిన్ ఈ సినిమాతో పాటుగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండిటితో పాటుగా చంద్రశేఖర్ యేలేటి సినిమా కూడా లైన్ లో ఉంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: