అను ఇమ్మాన్యువల్ గుర్తుండే వుంటుంది. పవన్ స్టార్ రాజకీయాల్లోకి వెళ్ళక ముందు చేసిన  అజ్ఞాతవాసి మూవీలో హీరోయిన్. పవర్ స్టార్ తో పాటు అల్లు అర్జున మూవీ నా పేరు సూర్య చేసింది. గత ఏడాది వచ్చిన ఈ రెండు మూవీస్ భారీ డిజాస్టర్లుగా మిగిలాయి. అనుకు అందముంది, అభినయమూ ఉంది. కానీ లేనిదల్లా లక్కే. దాంతో ఈ అమ్మడు ఇపుడు టాలీవుడ్ ని పట్టడానికి కొత్త షో మొదలెడుతోందిట.


అదే అందం దెబ్బతో మొత్తం టాలీవుడ్ నే తనవైపు తిప్పుకుంటుందిట. అయితే ఈ అమ్మడుకు ఐరన్ లెగ్ అని పేరు పెట్టకుండానే టాలీవుడ్ పక్కకు పెట్టడంతో ఇక సోషల్ మీడియానే వేదికగా చేసుకుని తెగ రెచ్చిపోవాలనుకుంటోందట. దాని కోసం ప్రత్యేకంగా ఫోటో షూట్ తో రెడీ అయిపోతోందట. కుర్ర గుండెలను పిండేసే హాట్ హాట్ పిక్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసేందుకు అను సై అంటోంది.


చాలా మంది హీరోయిన్ల లాగానే అను కూడా సోషల్ మీడియానే నమ్ముకుంది. ఈ దెబ్బకు టాలీవుడ్ క‌ళ్లలో కనబడతాను అంటోంది. తన అందాలతోనే పందెం కాస్తున్న ఈ ముద్దు గుమ్మ  ఇకపై మంచి కధలు వస్తెనే మూవీస్ చేస్తాను అంటోంది. తాను చేసిన సినిమాల్లో తన పాత్రకు కొంత ప్రాధాన్యత ఉంటేనే చేస్తాను అని కూడా అంటోంది.


అయితే అసలే మూవీస్ లేవు, ఈ తరహా కండిషన్లు పెడితే ఎవరు ముందుకు వస్తారు అంటున్నారు సినీ జనం.  అయితే తన గ్లామర్ మీద కంప్లీట్ నమ్మకం ఉన్న అను ఇక ఘాటు మసాలా ఏంటో చూపిస్తాను అంటోంది. సో కుర్ర కారు కాచుకోవాల్సిందే. అను రెచ్చగొట్టుడు ఏ రేంజిలో ఉంటుందో చూడాల్సిందేనంటున్నారు.  ఇక కళ్ళు కాస్కో అనాల్సిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: