సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఏ.ఆర్.మురగ దాస్ డైరెక్షన్ లో నటిస్తున్న కొత్త సినిమా 'దర్బార్'. ఈ సినిమాలో రజనీ కాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. యంగ్ హీరోయిన్ నివేదా థామస్ రజనీకాంత్ కి కూతురిగా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందితున్నాడు. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. 2020 సంక్రాంతికి రిలీజ్ కానున్న దర్బార్ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను గ్రాండ్ గా మొదలు పెటారు చిత్ర బృందం. అందులో బాగంగా మోషన్ పోస్టర్ ను ఈరోజు సాయంత్రం రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం నలుగు స్టార్ హీరోలు రంగంలోకి దిగడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా ఒకే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరో ఒకరి కోసం ఒకరు తమ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలకు హాజరవడం కామన్. ఇది తెలుగు, హిందీ, తమిళ్..ఇలా ప్రతీ ఇండస్ట్రీలో జరిగేదే. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఓవరాల్ సౌత్ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమాకి బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీస్ నుండి టాప్ స్టార్ హీరోస్ రజనీ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడం. బహుషా ఇదే మొదటిసారి కావడం ఆసక్తికిని రేత్తిస్తుంది. సాధారణంగా స్టార్స్ మధ్య సైలెంట్ వార్స్ ఉండటం సహజం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అందరు కలిసి ఏక తాటిపై నుంచుంటున్నారు. 

ఇక రజనీకాంత్ పా. రంజిత్ దర్శకత్వంలో నటించిన కబాలి లో రజనీ మేకోవర్ ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంది. ఒక డిఫ్రెంట్ మేనరిజం తో అద్భుతమైన డైలాగ్ డెలివరీ తో రజనీ ఫెంటాస్టిక్ అనిపించారు. ఆ తర్వాత కాలా, పేట, రోబో 2.ఓ సినిమాల ఫలితం ఎలా ఉన్నా రజనీ క్రేజ్ మాత్రం.. ఏమాత్రం తగ్గలేదు. అందులో భాగాంగానే వరుసగా సినిమాలను చేస్తూ జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్నారు. యంగ్ హీరోసన్నా ఒక్క ఫ్లాప్ పడగానే భయంతో మళ్ళీ సినిమా చేయడానికి ఎలాంటి కథ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక కనీసం సంవత్సరం సమయం తీసుకుంటున్నారు. కానీ రజనీ దారి రహదారి..అందుకే హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. 
అందులో భాగంగా ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టగ్గా హిందీ దర్బార్ పోస్టర్ ను బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రిలీజ్ చేశారు. ఇక తమిళ్ పోస్టర్ ను లోకనాయకుడు కమల్ హాసన్ రిలీజ్ చేయగా, మలయాళం పోస్టర్ ను మోహన్ లాల్, అలాగే తెలుగు మోషన్ పోస్టర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: