తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు హీరో స్థాయి క్రేజ్ దక్కటమంటే మాటలు కాదు. 90ల్లో విజయశాంతి తర్వాత ఆ స్థాయి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ అనుష్క మాత్రమే. ఈ ఘనత విజయశాంతి నుంచి మరో హీరోయిన్ కు రావటానికి దాదాపు పదిహేనేళ్లు పట్టిందనే చెప్పాలి. అరుంధతి సినిమాకు ముందు అనుష్క చేసిన సినిమాలు సాధారణ హీరోయిన్ పాత్రలే. అరుంధతితో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గానే కాదు.. సోలో క్రౌడ్ పుల్లర్ గా మారిపోయింది.

 


అరుంధతిలో అనుష్క స్క్రీన్ ప్రెసెన్స్ ఒక అద్భుతం. పదేళ్ల క్రితం అరుంధతి 80 కోట్లు కలెక్ట్ చేసిందంటే సామాన్యమైన విషయం కాదు. ఓ స్టార్ హీరో బ్లాక్ బస్టర్ సినిమాతో తీసుకొచ్చే కలెక్షన్లను అనుష్క సోలో పెర్ఫార్మెన్స్ తో రాబట్టింది. ఆ సినిమా తర్వాత అనుష్క రేంజ్ మారిపోయింది. సౌత్ లో బిజీయస్ట్ అండ్ క్రేజీయస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. వేదం, బాహుబలి సిరీస్, రుద్రమదేవి, భాగమతి, సైరా.. సినిమాల్లో ఆమె పాత్రలను మరొకరితో ఊహించుకోలేం. గ్లామర్ పాత్రలతోనూ ఆకట్టుకున్న అనుష్క రౌద్రం పండించడంలోనూ నెంబర్ వన్ గా నిలిచింది. సైరాలో చేసింది చిన్న పాత్రే అయినా ఝాన్సీదేవి గా ఆ కొన్ని నిముషాలు మెరుపులు మెరిపించింది.

 


సూపర్ సినిమాతో హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ స్వీటీ. ప్రస్తుతం గ్లామర్ పాత్రలు తగ్గించి హీరోయిన్ బేస్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ తన స్టార్ స్టేటస్ కు అర్ధాన్నిస్తోంది. ప్రస్తుతం నిశ్శబ్దం అనే సినిమాతో రానుంది. ఇటివల రిలీజ్ చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నేడు ఆమె జన్మదినం సందర్భంగా అభిమానులు సోషల్ మీడీయా వేదికగా విసెష్ చెప్తున్నారు. మరిన్ని క్రౌడ్ పుల్లింగ్ సినిమాల్లో అనుష్క నటించాలని కోరుకుంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: