మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వి.ఐ ఆనంద్ డైర్క్షన్ లో వస్తున్న సినిమా డిస్కో రాజా. హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత రవితేజ ఏరికోరి మరి ఎంచుకున్న సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమాపై మాములుగానే అంచనాలు పెరిగాయి. రాజా ది గ్రేట్ తర్వాత హిట్ కు దూరంగా ఉంటూ వస్తున్న రవితేజ ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.


ఇక డైరక్టర్ వి.ఐ ఆనంద్ ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో హిట్ అందుకోగా ఆ తర్వాత అల్లు శిరీష్ తో చేసిన ఒక్క క్షణం మాత్రం నిరాశపరచింది. ప్రస్తుతం డిస్కో రాజాతో డైరక్టర్ హీరో ఇద్దరు హిట్ గురి పెట్టుకున్నాడు. అసలైతే దసరాకు వస్తుందని అనుకున్న డిస్కో రాజా డిసెంబర్ 20న రిలీజ్ అని చెప్పారు.


అయితే అనుకోకుండా క్రిస్ మస్ రేసులో చాలా సినిమాలు వచ్చి పడ్డాయి. డిసెంబర్ 20న సాయి ధరం తేజ్ ప్రతిరోజు పండుగే, అనుష్క నిశ్శబ్ధంతో పాటుగా బాలయ్య బాబు రూలర్ సినిమా కూడా వస్తుంది. మూడు సినిమాల మధ్య వచ్చి పోటీ తట్టుకోవడం కన్నా సినిమా వాయిదా వేయడం మంచిది అనుకున్నారు డిస్కో రాజా యూనిట్.


ఇక అనుకున్న విధంగానే 2020 జనవరి 24న రిపబ్లిక్ డే సందర్భంగా ఓరోజు ముందు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి సినిమాలతో పాటుగా గణతంత్ర దినోత్సవం సినిమాకు వచ్చే సినిమాలకు మంచి హిట్ సెంటిమెంట్ ఉంది. అందుకే రవితేజ డిస్కో రాజా జనవరి 24కి వాయిదా వేసుకున్నాడు. ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే రిలీజైన మొదటి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. డిస్కో రాజా సినిమాలో రవితేజతో పాటుగా పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ జోడీ కడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: