వెంకటేష్.. నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న సినిమా వెంకీ మామ.  ఈ ఇద్దరు కలిసి సినిమా చేయాలనీ రామానాయుడు అనుకున్నారు.  కానీ, ఆయన కోరిక తీరకుండానే కాలం చేశారు.  మామ అల్లుళ్ళు కలిసి ప్రేమమ్ సినిమాలో నటించినా.. అది జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే.  అయితే, ఇద్దరు కలిసి ఎట్టకేలకు వెంకీ మామ సినిమా చేస్తున్నారు.  వెంకీ మామ సినిమాలో వెంకటేష్ పక్కా పల్లెటూరి వ్యక్తిగా కనిపిస్తుంటే.. నాగ చైతన్య ఆర్మీలో పనిచేసే సైనికుడిగా కనిపిస్తున్నాడు.  


అయితే, చిన్నప్పటి నుంచి చైతన్యను వెంకటేష్ తన భుజంపైనే ఎత్తుకొని పెంచినట్టు సినిమా టైటిల్ సాంగ్ ను బట్టి, గతంలో రిలీజ్ చేసిన చిన్న టీజర్ ను బట్టి తెలుస్తోంది.  అటు దగ్గుబాటి, ఇటు అక్కినేని ఫ్యామిలిలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఆసక్తి నెలకొన్నది.  ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.  సినిమా ఎలా ఉండబోతుంది అన్నది తెలియాల్సి ఉన్నది.  అయితే, పక్క పల్లెటూరి పండుగ సినిమా కాబట్టి సంక్రాంతికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.  


కానీ, సంక్రాంతికి సీజన్ లో రజినీకాంత్, మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు వస్తుండటంతో ఆ ప్లాన్ ను విరమించుకున్నట్టు తెలుస్తోంది.  సంక్రాంతి తరువాత సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉన్నది.  ఇక ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.  పక్కా మాస్ సాంగ్.. పల్లెటూరిలొ చిత్రీకరించిన ఈ సాంగ్ పల్లె అందాలను చూపిస్తూ షూట్ చేశారు.  థమన్ మ్యూజిక్ కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అద్భుతంగా సెట్ అయ్యాయి.  


మామ అల్లుళ్ళ అనుబంధం.. ఇద్దరు ఎలా ఉన్నారు.. ఎలా పేరు తెచ్చుకున్నారు అనే విషయాలను సాంగ్ లో చూపించారు.  సాంగ్ మస్త్ గా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.  ఇందులో వెంకటేష్ కు జోడిగా పాయల్ నటిస్తుంటే... చైతూకి జోడిగా రాశి ఖన్నా నటిస్తోంది.  బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.  వెంకటేష్ ఎఫ్ 2, చైతు మజిలీ తరువాత చేస్తున్న సినిమాలు కావడంతో ఆసక్తి పెరిగింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: