హన్సిక టాలీవుడ్ లో దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది మాములుగా ఆకట్టుకుంది. తెల్లతోలు పిల్ల హన్సిక కోసం అల్లు అర్జున్ ఎంతలా తాపత్రయ పడ్డాడో చూశాం. ఈ సినిమా హిట్ కావడంతో హన్సిక నక్కతోక తొక్కి వచ్చినట్టైంది.  వరసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో బిజీ అయ్యింది.  ఏ హీరోయిన్ కు అయినా కొంతకాలమే ఫేమ్ ఉంటుంది.  ఆ తరువాత ఫెడ్ అవుట్ కాకతప్పదు.  హన్సిక మాత్రం సినిమాలు ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నది.  హన్సికతో పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయ్యారు.  


హన్సిక మాత్రం ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నది.  2003లోనే బాలీవుడ్ సినిమాల్లో నటించింది.  2007 లో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.  ఇలా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హన్సిక తెలుగులో చేసింది కొన్ని సినిమాలే.  అయితే, తమిళంలో మాత్రం హన్సిక దూసుకుపోయింది.  తెలుగులో రెండు సినిమాలు చేస్తే... తమిళంలో మాత్రం హన్సిక వరసగా సినిమాలు చేసి అక్కడి హీరోయిన్స్ కు దెబ్బకొట్టింది.  


ఇప్పుడు తెలుగులో తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్ సినిమా చేస్తున్నది.  ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నది.  సినిమాపై అంచానాలు ఉన్నాయి.  అయితే, ఈ అమ్మడుకి తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ ఆఫర్లు ఇప్పటికి వస్తుండటం విశేషం.  ఇక సినిమాల్లో బిజీ గా ఉంటూనే హన్సిక సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటున్నది.  


సినిమా అంటే గ్లామర్ ప్రపంచం.  గ్లామర్ ప్రపంచంలో గ్లామర్ గా కనిపించకుంటే పెద్దగా లైక్ చేయరు.  గ్లామర్ గా ఉండాలి... అదే సమయంలో అభిమానులను ఆకట్టుకునే విధంగా ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుండాలి.  అప్పుడే ఆ హీరోయిన్ కు మంచి పేరు వస్తుంది.  అభిమానులు పెరుగుతారు. గ్లామరే కదా వాళ్లకు పెట్టుబడి.  అది ఉన్నప్పుడే దాన్ని యూజ్ చేసుకోవాలి.  అందంతో అందలం ఎక్కాలి.  అది సంగతి.  


మరింత సమాచారం తెలుసుకోండి: