టాలీవుడ్ లో ఓ వైపు రాజకీయాలు మరోవైపు సినిమాల్లో తనదైన మార్క్ చాటుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ.   స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలొో 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణీ లో నటించారు.  ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ మూవీ ‘పైసా వసూల్’ మూవీలో నటించారు.  ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో నటించిన బాలయ్య మరోసారి క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ లో నటించారు.  కానీ ఈ మూవీ అనకున్నంతగా హిట్ కాలేదు.


ఇటీవల ఏపిలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో హిందూపూర్ నియోజకవర్గంలో మరోసారి ఎమ్మెల్యేగా నిలబడ్డారు. ఎన్నికల ప్రచార నేపథ్యంలో మూడు ఐదు నెలలు గ్యాప్ ఇచ్చారు.  ప్రస్తుతం   బాలకృష్ణ ప్రస్తుతం రూలర్ చిత్రంలో నటిస్తున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య డిఫెరెంట్ గెటప్ లో కనిపిస్తున్నాడు.  ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన హాట్ బ్యూటీలు సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  బాలయ్యకు అచ్చి వచ్చిన సెంటిమెంట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.


వాస్తవానికి ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబోలో సినిమా రావాల్సింది. కానీ కొన్ని కారణాలవల్ల అది జరగలేదు.  దీనితో బోయపాటి బాలయ్య 106వ  మూవీకి దర్శత్వం వహించనున్నారు.  బోయపాటి ఈ మూవీ కోసం క్రేజీ కాంబినేషన్ సెట్ చేస్తున్నారు. కన్నడలో క్రేజీ హీరోయిన్ గ దూసుకుపోతున్న 27 ఏళ్ల యంగ్ హీరోయిన్ రచిత రామ్ బాలయ్యతో రొమాన్స్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  మరో ట్విస్ట్ ఏంటేంటే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం. జయ జానకి నాయక మూవీని  నిర్మించిన మిర్యాలగూడ రవీంద్ర బాలయ్య 106వ సినిమా నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: