స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'అల వైకుంఠపురములో'. పూజా హెగ్డే బన్ని సరసన రెండోసారి జతకడుతుండగా దర్శకుడు తో కూడా పూజా పనిచేయడం రెండవసారి. ఇక ఈ సినిమాకి ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సూపర్ స్టార్ సరిలేరు తో పోల్చుకుంటే ప్రమోషన్స్ లో బన్ని టీమ్ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. మొదటి పాట 'సామజవరగమన' విడుదలైన 24 గంటల్లో 60 లక్షల (6 మిలియన్) వ్యూస్ ని... 3 లక్షలకు పైగా లైక్స్ ని సాధించింది. ఇక యూట్యూబ్ లో అయితే ఇప్పటికే 7 కోట్ల వ్యూస్ ని దక్కించుకుంది. 

ఇటీవలి కాలంలో ఇంత ఫాస్ట్ గా అంతర్జాలంలోకి దూసుకెళ్లిన మరొక పాట లేదు. ఎస్.ఎస్.థమన్ బ్రాండ్ మ్యూజిక్ అద్భుతంగా వర్కవుటైంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరో మాస్టర్ క్లాస్ లిరిక్ ని అందించారు. ఈ ఒక్క సాంగ్ తోనే అల కి ఎవరు ఊహించనంతగా క్రేజ్ ని దక్కించుకుంది. అందుకే ఈ పాట విజువల్ గా ఎలా ఉండబోతోందని బన్ని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులలోను ఉత్కంఠ ఇప్పటికే తీవ్రంగా మొదలైంది. ప్రస్తుతం ఈ పాటను బన్ని-పూజ పై ప్యారిస్ లో చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకించి ఈ పాటలో మోస్ట్ స్టైలిష్ గా తనని తాను స్క్రీన్ మీద ప్రజెంట్ చేసుకునేందుకు బన్ని స్పెషల్ కాస్ట్యూమ్స్ ని ఎంపిక చేసుకున్నాడు. అందుకోసం ప్యారిస్ లో ప్రఖ్యాత మాల్ కి వెళ్లి కాస్ట్యూమ్స్ ని కొనుక్కున్నారని.. పూజా కాస్ట్యూమ్స్  అంతే ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకున్నారని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.

తాజాగా బన్నిపోస్టర్ ని రివీల్ చేసి దానికి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించారు. సామజవరగమన.. ఆన్ ది వే! అంటూ స్టైలిష్ గా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో డ్యాన్స్ మూవ్ మెంట్ ఉన్న ఫోటోని షేర్ చేశారు. బన్ని మార్క్ స్టెప్స్ కి ఏమాత్రం తగ్గడం లేదన్న హింట్  ఇచ్చాడు. ఈ పోస్టర్ తో ప్రేక్షకుల్లో ఇంకా ఆసక్తి పెంచారు. ఇక విజువల్ గా ఎలా ఉండనుంది? బన్ని డాన్స్ మూవ్ మెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. 2020 సంక్రాంతి కానుకగా మహేష్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సరిలేరు తో పోటీగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: