అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున తొలి సినిమా విక్రమ్ తో ఆకట్టుకున్నాడు.  శివ సినిమా నాగ్ కు టర్నింగ్ పాయింట్. వర్మ తన మొదటి సినిమాతోనే సినిమా ఇండస్ట్రీని మార్చేశాడు.  వర్మ మార్చిన ఇండస్ట్రీని అందరూ ఫాలో అవుతున్నారు.  ఎదుగుతున్నారు.  టాప్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు.  కానీ, వర్మ మాత్రం టాప్ గా ఎదిగి అక్కడి నుంచి కిందపడ్డాడు.  తనకు నచ్చిన పనిని నచ్చినట్టుగా చేసుకుంటూ పోతుంటాడు అంతే.  


వర్మను మార్చడం ఎవరితరం కాదు.  అది వేరే విషయం అనుకోండి.  అసలు విషయంలోకి వస్తే.. నాగార్జున కెరీర్ను మార్చేసిన సినిమా శివ.  ఈ సినిమా తరువాత నాగార్జున ఒక్కసారిగా ఇండస్ట్రీలో టాప్ 4 లో ఒకరిగా ఎదిగారు.  ఎన్నో సినిమాలు చేసిన నాగ్ కు ఇండస్ట్రీలో ఉన్నపేరు మన్మధుడు.  టాలీవుడ్ మన్మధుడు.  60 సంవత్సరాల వయసులోనూ నాగార్జున ఇంకా యంగ్ గా కనిపిస్తున్నాడు.  యంగ్  హీరోలకు మతిపోగొట్టేలా ఉన్న నాగార్జున కెరీర్లో ఎవరూ ఊహించని సినిమా చేశాడు.  


అదే అన్నమయ్య.  నాగార్జున ఏంటి అన్నమయ్య సినిమా చేయడం ఏంటి అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. పైగా అన్నమయ్య లాంటి సినిమాకు సినీ శృంగార శాస్త్రంలో పీహెచ్డి చేసిన రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం ఏంటి .. ఔరా అనుకున్నారు.  కానీ, అది సినిమా.. సినిమాను సినిమాలా ప్రేమించి చేశారు.  ఈ సినిమా కథను భారవి నాగార్జున చెప్పారు.  నాగార్జున కథను వినే సమయంలో రాఘవేంద్రరావు అక్కడి నుంచి వచ్చేశారట.  


వేరేలా అనుకోకండి...నాగార్జునను కథ సీరియస్ గా వింటున్నారు.  భారవి కూడా అలానే సీరియస్ గా చెప్తున్నాడు.  ఇద్దరి మధ్య ఎందుకు అని బయటకు వచ్చాడు.  తీరా కథ చెప్పడం అయ్యాక రాఘవేంద్రరావు వెళ్లి చూస్తే.. నాగార్జున కళ్ళు ఎర్రగా మారిపోయాయి.  అంతలా కథలో లీనం అయ్యాడు.  అదే ఇన్స్పిరేషన్ తో సినిమా చేశారు.  అన్నమయ్య అంటే ఇలానే ఉండేవాడేమో అన్నట్టుగా నాగ్ ఇన్వాల్వ్ అయ్యి నటించాడు.  మెప్పించి హిట్ కొట్టాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: