తెలుగు సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. పవన్ సినిమాలో అవకాశం కోసం ఎదురుచూసేవారికీ కొదవ లేదు. అలాంటివారి లిస్టులో హీరోయిన్లు కూడా ఉన్నారు. పవన్ తో సినిమా చేయడం ఎంజాయ్ చేశానని ఆమధ్య స్టార్ హీరోయిన్ త్రిష కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు అదే కోవలో మరో లేడీ స్టార్ హీరోయిన్ అనుష్క కూడా చేరిపోయింది. ఇటివల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని రివీల్ చేసింది.

 


‘పవన్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. కానీ ఆ అవకాశం వస్తుందేమోనని ఎదురుచూస్తున్నాను’ అంటూ స్వీటీ తన మనసులోని కోరికను బయటపెట్టింది. కొన్నేళ్ల క్రితం పవన్ కల్యాణ్ నిర్మాత కొండా కృష్టంరాజు సినిమాలో ఓ హాలీవుడ్ దర్శకుడితో సినిమా అనౌన్స్ చేశాడు. అందులో హీరోయిన్ గా అనుష్కనే ప్రకటించారు. షూటింగ్ జరుగుతోందని నిర్మాత కూడా ఓసారి ప్రకటించాడు. కానీ.. ఆ సినిమా అప్పట్లోనే ఆగిపోయింది. ఓ స్టిల్, గానీ, టైటిల్ గానీ, మరే న్యూస్ రాకుండానే ఆ ప్రాజెక్టు మరుగున పడిపోయింది. బహుశా అనుష్క చెప్పిన అవకాశం అదే అయి ఉండొచ్చు. దీంతో పవన్ హీరోయిన్ గా అనిపించుకునే అవకాశం తనకు చేజారిపోయింది. అప్పటి నుంచీ అనుష్కకు మరో అవకాశం రాలేదు.

 


స్టార్ హీరోయిన్ గా త్రిష ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో కూడా బంగారం సినిమాలో క్లైమాక్స్ లో రెండు నిమిషాల క్యారెక్టర్ చేసింది. ఎలాగూ పవన్ సినిమాలు చేస్తున్నాడని టాక్ ఉంది కాబట్టి.. పవన్ తో సినిమా చేసి స్టార్ పెయిర్ అనిపించుకోవాలనే అనుష్క తీరుతుందేమో చూడాలి. ప్రేక్షకులకు కూడా పవన్అనుష్క కాంబినేషన్ ఆసక్తి రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: