టాలీవుడ్ ఇండస్ట్రీలో మలయాళంలో మంచి మార్కెట్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది బన్నీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతగా బన్నీ మల్లూవుడ్ లో తనకంటూ సపరేట్ మార్కెట్ క్రియేట్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ఇండస్ట్రీలో ఉన్న బడా హీరోలు సైతం తమ సినిమాలను ఆపుకునే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. చాలా సినిమాలు అల్లు అర్జున్ మలయాళం లో ఉన్న తన అభిమానులను దృష్టిలో పెట్టుకొని స్టోరీలను కూడా ఎంచుకున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అల వైకుంఠపురములో” సినిమా ద్వారా మలయాళం లో ఉన్న తన అభిమానుల కోసం అదిరిపోయే గిఫ్ట్ అల్లు అర్జున్ రెడీ చేసి ఇటీవల అందించారు.


ఆ ప్రాంతంలో ఉన్న వారి కోసం స్పెషల్ గా ఒక మాస్ పోస్టర్ విడుదల చేసి మలయాళంలో “అంగు వైకుంఠపురతు” అని మలయాళ వెర్షన్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ విడుదల చేసిన ఈ పోస్టర్ మలయాళం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి నెలలో విడుదల కానుంది. ‘నాపేరు సూర్య’ దారుణంగా డిజాస్టర్ కావటంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి అల్లు అర్జున్ డిసైడ్ అయినట్లు సమాచారం.


గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బన్నీ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోవడంతో ఈ సినిమాపై అల్లు అర్జున్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. మరోపక్క అల్లు అర్జున్ ఈ సినిమాతో ఎలాగైనా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని మంచి కసి మీద ఉన్నారు. మరి రాబోయే సంక్రాంతికి అల్లు అర్జున్ “అల వైకుంఠపురములో” సినిమాతో సక్సెస్ అందుకుంటుండో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: