ఈ మధ్య కాలంలో సినిమాలు ఎక్కువగా అడల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. వారానికి ఒకటో రెండో సినిమాలు ఇలానే దర్శనమిస్తున్నాయి. ఈరోజుల్లో యువతకు కావాల్సింది ఇదే అంటూ దర్శక నిర్మాతలు కొత్త ప్రయోగాల పేరుతో అందరూ అదే కానిస్తున్నారు.. ముసుగులో గుద్దులాటా అన్నట్లు ఉంది.. ఒకప్పుడు సినిమాలలో ఎక్కడో ఒక చోట కనిపిస్తే ఇప్పుడు మాత్రం.. సినిమాలే అవి వస్తున్నాయి..


డబ్బుల కోసం సినీ ఇండస్ట్రీలో ఎంతకైనా తెగిస్తుందని అర్థమవుతుంది.. శృంగారపు సీన్లు ఉంటే సెన్సార్ కట్ చేసేది ఇప్పుడు సినిమాలు మొత్తం ఇలానే ఉండటంతో వారు కూడా చూసి చూడనట్లు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నారు. యువత అటువంటి సినిమాలకు మొగ్గు చూపడంతో సినీ ఇండస్ట్రీ మాత్రం అదే ఫార్ములాను అమలు చేస్తున్నారు. 


మొదట టీజర్ ట్రైలర్ తో బాగా ఆకట్టుకుంది. ప్రేక్షకులు దేని కోసం అయితే వెళ్లారో ఆ కంటెంట్ సినిమాలో లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. సినిమా చూసి బయటకు వచ్చిన తరవాత వాళ్ల ముఖాలు చూసి నవ్వాలో, బాధపడాలో అర్థంకాదు. టిక్కెట్ డబ్బులకు అస్సలు న్యాయం జరగలేదనే ఫీలింగ్ ఒకపక్క.. ఎం చెప్పారు.. ఎక్కడ ఎం చూపించారు. అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్లతో దుమ్మెత్తి పోస్తున్నారు. 


వాస్తవానికి టీజర్లు, ట్రైలర్ చూసిన ఎవరైనా ఈ సినిమా గురించి మాట్లాడకుండా ఉండరు. అంత ఘోరంగా చూపించారు. ఒకప్పటి షకీలా సినిమాల కన్నా దారుణంగా చూపించారు. దీంతో అలాంటి సినిమాలు చూసే ప్రేక్షకులు తెగ ఆరాటపడ్డారు. కానీ, సెన్సార్ బోర్డు మాత్రం ఆ సీన్లన్నింటినీ కట్ చేసి పారేసింది. ఇక ఎలాగూ ఆ సీన్లన్నీ ట్రైలర్‌లో చూపించాం కదా.. సినిమాలో మిగిలిన కంటెంట్ చూపిస్తే చాలులే అనుకున్నారేమో దర్శక నిర్మాతలు. ఆ విషయాలేమీ బయటపెట్టకుండా మంచి హైప్ క్రియేట్ చేసి సినిమాను విడుదల చేశారు. ఈ విషయం తెలియక ఎగబడి థియేటర్లకు వెళ్లినవాళ్లు తీవ్ర నిరాశతో బయటికి వస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: