వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం రాజకీయంగా కాంట్రవర్షియల్ సినిమాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి రెండో భార్య లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితం లోకి వచ్చాక రాజకీయంగా సినిమాపరంగా ఎన్టీఆర్ లైఫ్ లో వచ్చిన మార్పులను అలాగే అనేక వాస్తవాలను ప్రపంచానికి తెలియని కొన్ని విషయాలను చూపిస్తున్నాము అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అప్పట్లో విడుదల చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం విడుదల కాలేదు.


దానికి కారణం అప్పుడు ఏపీలో అధికారం తెలుగుదేశం పార్టీ ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సినిమానే అడ్డుకున్నట్లు అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ అనే సినిమా చేయడం జరిగింది. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా వచ్చిన మార్పులను హైలెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా లో వైసీపీ పార్టీ వ్యవస్థాపకుడు వైయస్ జగన్ ని చాలా అద్భుతంగా చూపించి...మిగిలిన రాజకీయ పార్టీల నేతలను పరమ చాలా గట్టిగా టార్గెట్ చేసినట్లు విడుదలైన ట్రైలర్ బట్టి అర్థమవుతుంది.


అదేవిధంగా చంద్రబాబు, నారాలోకేష్, పవన్ కళ్యాణ్ పై వర్మ తన ట్విట్టర్ లో వివాదాస్పద పోస్ట్ లు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా వర్మ వంగవీటి రంగ తనయుడు రాధాపై వివాదాస్పద వ్యాఖ్యలు ట్విట్టర్లో చేసి వంగవీటి రాధా ని కెలికారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో వంగవీటి రాధా పాత్ర ఇదే అంటూ ఓ ఫోటో పోస్ట్ చేశాడు. సిట్ అధికారి సుందరి వంగవీటి రాధాని విచారణ చేస్తున్నారు.. సారీ సారీ వంగవీటి కాదు.. గంగవీటి భవాని.. కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో ఓ దృశ్యం అని వర్మ ట్వీట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా...వంగవీటి రాధా అభిమానులు మాత్రం రాంగోపాల్ వర్మ పై మండిపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: