త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటిస్తున్న 'అలావైకుంఠపురం లో' సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో సినిమా అయిన నేపథ్యంలో అలా వైకుంఠపురం లో సినిమాపై అల్లు అర్జున్ అభిమానులు బీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన విడుదలైన పాటలు సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సామజ వర గమన సాంగ్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. భారతదేశంలోనే ఏ ఒక్క సినిమా హీరో కి దక్కని రికార్డులు సోషల్ మీడియా లో అల్లు అర్జున్ కి 'సామజవరగమన' అనే సాంగ్ తో దక్కడం జరిగాయి. 'సామజవరగమన' విడుదలైన మొదటి రోజు 24 గంటల్లోనే 60 లక్షల (6 మిలియన్) వ్యూస్ ని... 3 లక్షలకు పైగా లైక్స్ ని దక్కించుకుంది. యూట్యూబ్ లో ఇప్పటికే 7 కోట్ల వ్యూస్ ని దక్కించుకుంది.


ఇటీవలి కాలంలో ఇంత వేగంగా అంతర్జాలంలోకి దూసుకెళ్లిన వేరొక పాట లేనే లేదు. ఎస్.ఎస్.థమన్ బ్రాండ్ మ్యూజిక్ అద్భుతంగా వర్కవుటైంది. దీంతో సినిమా యూనిట్ ఈ సాంగు చిత్రీకరణ పై స్పెషల్ ఫోకస్ పెట్టారట. సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో మామూలుగా కాని చేద్దామని అనుకున్న సినిమా యూనిట్ సామజవరగమనా పాట వీడియో చిత్రీకరణ కోసం స్పెషల్ గా ప్యారిస్ షెడ్యూల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారట. ప్రస్తుతం ఈ పాటకి సంబంధించిన సాంగ్ షూటింగ్ ప్యారిస్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సాంగులో మోస్ట్ స్టైలిష్ గా తనని తాను ఆవిష్కరించుకునేందుకు బన్ని స్పెషల్ కాస్ట్యూమ్స్ ని ఎంపిక చేసుకున్నాడు.


అందుకోసం ప్యారిస్ లో ప్రఖ్యాత మాల్ కి వెళ్లి కాస్ట్యూమ్స్ ని కొనుక్కున్నారని.. పూజా కాస్ట్యూమ్స్  అంతే ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకున్నారని ప్రచారమైంది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా సామజ వర గమన పాట కి సంబంధించిన పోస్టర్ ని సినిమా యూనిట్ ఇటీవల విడుదల చేయడంతో సోషల్ మీడియాలో విడుదలైన పిక్ వైరల్ అవుతుంది. విడుదలైన ఫోటో లో అల్లు అర్జున్ చాలా స్టైలిష్ గా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో అదిరిపోయే స్టైలిష్ మూమెంట్ డాన్స్ తో దర్శనం ఇస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: