జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నిస్తాను అంటూ 2014 సంవత్సరంలో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి 2019 ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసి చాలా ఘోరంగా ఓడిపోయారు. దీంతో అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు చాలా నిరుత్సాహం చెందరు. పవన్ కళ్యాణ్ ఓడిపోవడంతో తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వెళ్లిపోతారని అప్పట్లో వార్తలు రాగా...వెంటనే ఓటమి నుండి తేరుకుని చచ్చేవరకు నేను జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తాను నా చివరి కట్టె కాలే వరకు రాజకీయాల్లోనే ఉంటాను ప్రజా సమస్యలపై పోరాడుతా...ఒక్కసారి మాట చెబితే వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు అంటూ అప్పట్లో ఓటమి నుండి తేరుకుని అనేక జిల్లాల జనసేన పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశమైనప్పుడు పవన్ కళ్యాణ్ ఇటువంటి డైలాగులు వేశారు.


అయితే తాజాగా మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి వస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీ క్రిటిక్ తరం ఆదర్శ్ ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటిస్తాడని పోస్ట్ చేయడం తో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ పక్కా అని భావిస్తున్నారు. అయితే ఈ విషయం లో పవన్ కళ్యాణ్ బాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాత బోనికపూర్ పై సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్నీ ఎందుకు ఖండించలేదని అన్నారని సమాచారం. విషయంలోకి వెళితే బాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ అయినా పింక్ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడటం తో...ఆ సినిమా బోనికపూర్ నిర్మించాలని డిసైడ్ అయ్యారట.


దీంతో వస్తున్న వార్తలపై బోనీకపూర్ ఖండించకపోవడంపై...పవన్ సీరియస్ అయినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. మరోపక్క పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారన్న వార్తలు రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులకు మంచి జోష్ మీద ఉన్నారు. ఇంకోపక్క ప్రత్యర్థి పార్టీల నాయకులు ప్యాకేజీ అయిపోయినట్టుంది...ప్రజా సమస్యలపై పోరాడుతా...నా చివరి కట్టె కాలే వరకు రాజకీయాల్లో నే ఉంటా అని ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యకర్తలతో నాయకులతో డైలాగులు వేసిన పవన్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోవడం బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అన్నట్టు కామెంట్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: