పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.  ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ అనేక సినిమాలు చేసాడు.  సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొత్తల్లో పవన్ ఫ్యామిలీ డ్రామా సినిమాలు చేశారు అందులో ఒకటి గోకులంలో సీత.  ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో రాశి హీరోయిన్.  సీత పాత్రకోసం ఆమెను తీసుకున్నారు.  అనుకున్నట్టుగానే సినిమా మంచి విజయం సాధించింది.  ఇందులో సీత పాత్ర రాశికి ఎలా వచ్చిందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు.  


బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రాశి.  అప్పటి నుంచి అందరికి సుపరిచయమే.  అయితే, పవన్ కళ్యాణ్ గోకులంలో సీత సినిమా చేసే సమయంలో, హీరోయిన్ గా ఎవర్ని ఎంచుకోవాలి అనుకునే సమయంలో మెగాస్టార్ సతీమణి సురేఖ.. హీరోయిన్ రాశిని ఇంటికి పిలిచారట.  మెగాస్టార్ ఇంటినుంచి పిలుపు వస్తే వెళ్లకుండా ఉంటారా చెప్పండి.  వెళ్ళింది.  అక్కడ సురేఖ ... రాశిని చూసి.. సీత పాత్రకు ఈ అమ్మాయి సరిపోతుందని చెప్పడంతో పవన్ కళ్యాణ్ కూడా ఒప్పేసుకున్నాడు.  


అలా రాశి పవన్ గోకులంలో సీత సినిమాలో అవకాశం దక్కించుకుంది.  ఇక చిన్నప్పటి నుంచి రాశికి ఓ కోరిక ఉండేదట.  ఎలాగైనా వెంకటేష్ ను వివాహం చేసుకోవాలి అనుకునేది.  ఈ విషయాన్ని రాశినే చెప్పింది.  వెంకటేష్ అంటే ఆమెకు చాలా ఇష్టం అని, వెంకటేష్ ను వివాహం చేసుకోవాలి అనుకున్నట్టుగా రాశి చెప్పుకొచ్చింది.  ఇక తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమా విషయంలో రాశి చాలా సీరియస్ అయ్యింది.  


సినిమా సమయంలో తనకు చెప్పిన కథ ఒకటి అని సెట్స్ మీదకు వెళ్లిన తరువాత తీసిన సినిమా మరొకటి అని చెప్పింది.  సినిమాలో గోపీచంద్ కు లవర్ గా కనిపించాలని, మధ్యలో విలన్ వస్తాడని చెప్పిన తేజ, సినిమా కథనే మార్చేసి తనను నెగెటివ్ రోల్ లో చూపించాడని చెప్పింది.  ఇక ఇదిలా ఉంటె, రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రకోసం మొదట రాశిని సంప్రదించాడట సుకుమార్. కానీ, ఆ పాత్రకు తాను సెట్ కానని చెప్పడంతో ఆ అవకాశం అనసూయ దగ్గరకు వెళ్లినట్టు రాశి తెలిపింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: