ఈమధ్య విశాఖపట్నంలో జరిగిన లాంగ్ మార్చ్ లో పవన్ కు మంచి స్పందన వచ్చింది. ఆ స్పందన ఇచ్చిన ఉత్సాహంతో పవన్ మరింత రెచ్చిపోయి జగన్ పాలన బాగుంటే నేను హాయిగా సినిమాలు చేసుకుని ఉండేవాడిని అన్న మాటాలు యధాలోపంగా అన్నాడు. అయితే ఇప్పుడు ఆ మాటలే ‘పింక్’ రీమేక్ కు అడ్డు తగులుతున్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పుడు పవన్ హడావిడిగా సినిమాలలోకి వెళ్ళిపోతే తన మాటలు తానే ఖండించుకున్నట్లు అయి జగన్ పరిపాలన బాగుంది అని పరోక్షంగా ఒప్పుకున్నట్లు అవుతుందని పవన్ సన్నిహితులు సూచిస్తున్నట్లు టాక్. దీనితో పవన్ తన సినిమా రీ ఎంట్రీ విషయం కనీసం ఒక 6 నెలలు వాయిదా వేసుకోవడం మంచిది అని అతడికి సలహాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి పరిస్థితులలో మరొక మార్గం లేక పవన్ తన ‘పింక్’ రీమేక్ ఆలోచనలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాడు అని అంటున్నారు.  దీనికితోడు ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కష్టాలకు సంబంధించి పవన్ ఇచ్చిన రెండు వారాల గడువు గురించి అక్కడి ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. 

దీనికితోడు పవన్ ‘లాంగ్ మార్చ్’ లో ఆతరువాత చేసిన కామెంట్స్ పై విపరీతమైన ఎదురుదాడి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం పవన్ తన మాటలకు సంబంధించి ఆత్మ రక్షణలో ఉన్నాడు. ఈ నేపధ్యంలో ఇప్పుడు మళ్ళీ ఫిలిం ఎంత్రీలోకి వచ్చి మళ్ళీ రెండు పడవల ప్రయాణం చేసి తన మాటలను తానే ఖండించుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ముద్ర వేయించు కోవడం ప్రస్తుత పరిస్థితులలో పవన్ కు ఏమాత్రం ఇష్టం లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో పవన్ ఆవేశం ఈసారి అతడి సినిమాల రీ ఎంట్రీకి శతృవుగా మారిందా అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: