నిజ జీవితంలో జరిగిన కథలను తీసుకొని వర్మ సినిమాలు తీస్తుంటాడు.  ఇలాంటి సినిమాలు తీయడంలో వర్మ చాలా గొప్పోడు.  అప్పట్లో రక్త చరిత్ర సినిమా తీసి వావ్ అనిపించాడు.  ఆ సినిమా కోసం ఓ టీం ను వెంటబెట్టుకొని అనంతపురం చుట్టూ తిరిగాడు.  ఈ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు మంచి హిట్ కొట్టాడు.  అంతకు ముందు బాలీవుడ్ లో వర్మ సర్కార్, సర్కార్ రాజ్ వంటి సినిమాలు తీశాడు.  బాల్ ఠాక్రే జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా అది.  


ఇటీవలే ఎన్టీఆర్ జీవితం ఆధారంగా అసలైన కథను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశ్యంతో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీశాడు.  ఈ సినిమాను ఏపిలో రిలీజ్ కాకుండా బాబు అడ్డుకున్నాడు అంటే అర్ధం చేసుకోవచ్చు.  ప్రస్తుతం వర్మ కమ్మ రాజ్యం కడప రెడ్లు సినిమా తీస్తున్నాడు.  టైటిల్ చూస్తేనే ఎవరికైనా సరే యిట్టె కాలిపోతుంది.  ఇదెక్కడి టైటిల్ అని తిట్టిపోస్తారు.  వర్మకు కావాల్సిందే అది.  ఎంతమంది ఆయన గురించి తిట్టుకుంటే అంత పబ్లిసిటీ.  


నెగెటివ్ పబ్లిసిటీని వర్మ క్యాష్ చేసుకుంటాడు.  ఆ పబ్లిసిటీ నుంచి ఎలా డబ్బులు రాబట్టలో వర్మకు బాగా తెలుసు.  అందుకే వర్మ క్లిక్ అయ్యాడు.  అయితే అన్ని వేళల ఇది వర్కౌట్ కాకపోవచ్చు.  కానీ, వర్మ దానిని వర్కౌట్ చేయించుకుంటాడు.  అదే వర్మ స్పెషలిటీ.  వర్మకు నచ్చిందే చేస్తాడు తప్పించి.. ఎవరు చెప్పినా పట్టించుకోరు.  అదే వర్మ స్పెషలిటీ అంటే... 


ఇక ఇదిలా ఉంటె, వర్మ చేస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో వంగవీటి రాధా పాత్రను ధన్ రాజ్ చేస్తున్నాడు.  ఈ పాత్రకు వర్మ పెట్టిన పేరు గంగవీటి భవాని.  కమ్మ ప్రభావం ఎక్కువగా ఉండే విజవాడ ప్రాంతంలో కడప నుంచి వచ్చిన రెడ్లు అధికారాన్ని సొంతం చేసుకున్నాక ఏం జరిగింది అన్నది కథ.  ఈ సినిమాలో రాజకీయ నాయకులందరి పాత్రలను చూపించాడు.  ఎవర్ని వదలలేదు.  చివరకు కెఏ పాల్ ను కూడా వర్మ వదలలేదు.  ఈ సినిమా ఈ నెలాఖరుకు రిలీజ్ కాబోతున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: