మామూలు కమర్షియల్ సినిమాలో ఎక్కువ పాటలు పెట్టినా పెద్దగా సమస్య రాదు గాని పౌరాణిక చిత్రాల్లో లేదా చరిత్రకు సంభందించిన సినిమాల్లో ఎక్కవ పాటలు పెట్టడానికి పెద్దగా స్కోప్ ఉండదు. అయితే ఇలాంటి చిక్కుల వల్లనే సైరా లాంటి భారీ చిత్రం నుంచి కోట్లు ఖర్చు చేసిన వాటిలోంచి చాలానే ఎడిట్ చేశారు. చిరు-తమన్నాలపై  కోట్లు ఖర్చు చేసి తెరకెక్కించిన ఓ ఇంపార్టెంట్ పాటనే తొలగించామని నిర్మాత చరణ్ తెలిపారు. అయితే ఇప్పుడు  దర్శకధరుని RRRలో ఏకంగా ఏడెనిమిది పాటలు ఉంటాయని ప్రచారం సాగుతోంది. అసలే దేశ భక్తి సినిమా కావడంతో ఇందులో స్ఫూర్తి నింపే.. ఉద్రేకాన్ని పెంచే దేశ భక్తి గీతాలకు కొదవేమీ ఉండదని.. పైగా ఇద్దరు స్టార్ల కు పాటల్ని షేర్ చేయాల్సొచ్చిందని సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.


ఇప్పటికే సుద్దాల అశోక్ తేజ్ మూడు పాటలను రాశారు .. వాటికీ సంబంధించిన బాణీలు కూడా అయిపోయాయని తెలుస్తుంది. అయితే పాన్ ఇండియా కేటగిరీ లో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ లో అన్ని పాటలుంటాయా? ఎనిమిది పాటలు కేవలం తెలుగు వెర్షన్ ని దృష్టిలో పెట్టుకునేనా?  లేక అన్ని వెర్షన్లలో ఉంటాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  బిట్ సాంగ్స్ కట్ సాంగ్స్ వరకూ ఓకే కానీ అన్ని పూర్తి నిడివి పాటలు అయితే కష్టమే. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో సినిమా చిత్రీకరణ సాగుతోంది.


మరి సినిమాలో నిజంగా ఎనిమిది పాటలు ఉంటాయా లేదా అంటే అఫీషియల్  సమాచారం వచ్చే వరకు ఏమి చెప్పలేము. మొన్నా ఆ మధ్య కేవలం మూడు పాటలు మాత్రమేనని టాక్ వచ్చింది. ఈ సినిమాని తెలుగు-తమిళం-హిందీ సహా అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. అందుకు తగ్గట్టే దాదాపు 250-300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో.. రామ్ చరణ్  అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఆలియా సీత పాత్రలో నటిస్తోంది. 2020 జూలై 30న సినిమా రిలీజ్ కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: