త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో బలమైన ఎమోషన్స్ తో పాటు సెంటిమెంట్స్ కూడ ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఇప్పుడు సంక్రాంతి రేసుకు రాబోతున్న ‘అల వైకుంఠపురములో’ మూవీ గురించి ఇప్పుడు లేటెస్ట్ గా ఒక ఆసక్తికర విషయం లీక్ అయింది. 

గతంలో సీనియర్ హీరోలు అక్కినేని ఎన్టీఆర్ కృష్ణ శోభన్ బాబు సినిమాల సూపర్ హిట్ కు సహకరించిన ‘సిస్టర్’ సెంటిమెంట్ ను ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ చూపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న టబు బన్నీకి అక్క అని తెలుస్తోంది. 

ఈ మూవీలో అల్లు అర్జున్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేపధ్యంలో కనిపిస్తుంది. అయితే టబు బాగా డబ్బున్న హై క్లాస్ ఫ్యామిలీకి కోడలుగా వెళుతుంది. అక్కడ ఆమెకు అనేక సమస్యలు ఏర్పడుతాయి. ఆ తరువాత ఈ సమస్యలను తెలుసుకుని బన్నీ వాళ్ళ అక్క ఇంటిలోకి అడుగు పెట్టిన విధానం అక్కడ జరిగిన తతంగం అంతా చాల సరదాగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి అల్లు అర్జున్ ఒకేసారి ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ ముందు బిలియనీర్ గా మారిపోతాడు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి బిలియనీర్ గా ఎలా మారిపోయాడు అతడి అక్క కష్టాలను ఎలా తీర్చాడు అన్న ఒక చిన్న పాయింట్ చుట్టూ విపరీతంగా నవ్వులు తెప్పించే డైలాగ్స్ తో ఈ మూవీ కథను త్రివిక్రమ్ అల్లడం వెనుక ఒకనాటి పాత సినిమాల సిస్టర్ సెంటిమెంట్ బాగా కీలక పాత్ర వహించింది అని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్ కావడంతో మరొక పాటను ఈ నెలలో విడుదల చేసి ఈ మూవీ మ్యానియాను మరింత పెంచే ఆలోచనలలో బన్నీ త్రివిక్రమ్ లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: