కమల్ హాసన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క ప్రసిద్ధి చెందిన నటులలో ఒకరు. కమల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ భారతీయుడు 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ద బడ్జెట్ డ్రామా మూవీ 'భారతీయుడు 2' టీం కమల్ హాసన్ యొక్క బ్యాక్ లుక్ ఉన్న కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. 


కమల్ హాసన్ ముఖం పోస్టర్‌లో కనిపించట్లేదు, ఈ లేటెస్ట్ పోస్టర్ లో కమల్ హాసన్ తన సేనాపతి గెటప్‌లోని ఒక కోట వద్ద నిలబడి క్రిందివైపుగా  చూస్తున్నారు. 1996 చిత్రం భారతీయుడు కి ఈ మూవీ సీక్వెల్, ఇక ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, ప్రియ భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, ఐశ్వర్య రాజేష్, ఢిల్లీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ విద్యుత్ జమ్వాల్ కూడా విలన్ గా నటిస్తున్నారు. కమల్ హాసన్ తన ఐకానిక్ ‘సేనాపతి’ పాత్రలో నటిస్తున్నారు, ఈ మూవీ 'ఐ' మరియు రోబో 2.0 ఫేం శంకర్ చేత డైరెక్ట్ చేయబడుతోంది. 


ఇటీవలే ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ను చిత్ర బృందం చెన్నైలో షూట్ చేశారు. కమల్ హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ పాల్గొన్న సన్నివేశాలను చెన్నై నగరంలో చిత్రీకరించారు. కొన్ని ఫైట్ సీన్లు కూడా ఇటీవల చిత్రీకరించబడ్డాయి. స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్మూవీ ఫైట్స్ కు  అద్భుతంగా చిత్రీకరించినట్లు సమాచారం. రెండవ షెడ్యూల్‌లో హై-ఆక్టేన్ స్టంట్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ రాబోయే బహుభాషా డ్రామా భారతీయుడు 2 లో చాలా సిజిఐ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 


కమల్ హాసన్ మరియు కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు మరియు లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీ ని నిర్మిస్తోంది. రత్నవేలు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: