యాంకర్
ప్రదీప్ గత కొద్ది రోజులు గా కనిపించడం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి.
ప్రదీప్ అరోగ్యం బాగలేకపోవడంతో బుల్లితెరమీద కనిపించడం లేదంటే.. మరి కొందరు
యాక్సిడెంట్ అయిందంటూ సోషల్
మీడియా లో ప్రచారం చేశారు. కొందరు
ప్రదీప్ పెళ్లి చేసుకుంటున్నాడని అందుకే షోలకు కొన్నాళ్ల పాటు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాడు అంటూ పుకార్లు పుట్టించారు. ఇక కొంతమందైతే ఏకంగా
ప్రదీప్ మల్లెమాల వాళ్ళతో మాట తెడా వచ్చి షోస్ చేయడం మానేశాడని రాసేశారు. వాటన్నింటి కి ఫుల్ స్టాప్ పెట్టి
ప్రదీప్ అందరికి షాకిచ్చాడు.
సోషల్ మీడియాలో ఒక వీడియోను
ప్రదీప్ పోస్ట్ చేసి నేను బాగానే ఉన్నానంటు క్లారిటి ఇచ్చాడు. వాస్తవంగా తన గురించి గత కొన్ని రోజులుగా రక రకాల రూమర్స్ క్రియోట్ చేసినవాళ్ళకి ఈ క్లారిటి ఇచ్చినట్టు తెలుస్తోంది. నాకు ఏమైందా అంటూ బాధపడ్డ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెల రోజులుగా ఇంట్లో రెస్ట్ తీసుకున్నాను. నా కాలికి షూట్ సమయంలో చిన్న ప్రాశ్చర్ అయ్యింది. అయినా కూడా షూట్స్ లో పాల్గొనడం వల్ల కాస్త సీరియస్ అయింది అంతే తప్ప ఇంకేమీ లేదని చెప్పాడు.
గత నాలుగు అయిదు వారాలుగా కాళును అలా పైకి పెట్టి
టీవీ చూస్తూ కూర్చున్నాను. ఇంకో రెండు వారాల్లో షూట్ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు. షూటింగ్స్ ను చాలా మిస్ అయ్యాను. ఈమద్య కాలంలో ఇంత బ్రేక్ తీసుకోవడం ఇదే. చాలా ఇబ్బందిగానే అనిపించినా తప్పలేదు అంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఈ నెల రోజుల్లో గడ్డం మీసాలు బాగా పెంచానంటూ తన మార్క్
కామెడీ కూడా చేశాడు.
బుల్లి తెరపై ఎంటర్ టైన్ చేసినట్లుగానే ఆ వీడియోలో కూడా చాలా సరదాగా మాట్లాడుతూ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునేలా చేశాడు మాచిరాజు. మొత్తానికి కాలుకు అయిన చిన్న గాయం కారణంగా బ్రేక్ తీసుకున్నట్లుగా చెప్పిన
ప్రదీప్ అతి త్వరలోనే మళ్లీ బుల్లి తెరపై సందడి చేయడం కన్ఫర్మ్ అంటూ ప్రకటించాడు.
ప్రదీప్ ప్రకటనతో ఆయన ఫ్యాన్స్ అంతా హ్యాపీ.
ప్రదీప్ వీడియో రావడం తో ఇక పుకార్లకు
చెక్ పడింది. వాస్తవంగా ఇదే విషయాన్ని మరో యాంకర్
రవి కూడా ఇంతకముందు చెప్పాడు. అయినా మన వాళ్ళు ఊరుకునే వాళ్ళు కాదు కదా..అందుకే
ప్రదీప్ గురించి నానా రాతలు రాసి పడేశారు.