బాలక్రిష్ణ బోయపాటి శ్రీను ఈ ఇద్దరు కాంబో మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అందుకు వారి గత సినిమాలే కారణం.2010లో వచ్చిన సింహా మూవీ బాలయ్యను ఎక్కడికో తీసుకువెళ్ళింది. ఆయనకు రెండవసారి నంది అవార్డుని ఇప్పించింది.  అప్పటికి వరసగా ఫ్లాపులతో ఉన్న బాలయ్యకు భారీ హిట్ అలా దక్కింది. ఇక 2014 వచ్చేసరికి లెజెండ్ తో ఈ జంట ముందుకు వచ్చింద్ల్. లెజెండ్ కూడా విరగదీసింది. పైగా మళ్ళీ బాలయ్యకు  మూడవసారి నంది తెచ్చిపెట్టింది. ఇలా బాలయ్య, బోయపాటి సినిమాలు ఒకదానిని మించి మరొకటి హిట్ అయ్యాయి. ఇపుడు  ఈ ఇద్దరి హ్యాట్రిక్ మూవీ వస్తోంది.


అయితే ఈ హ్యాట్రిక్ మూవీ విషయంలో ఎన్నో అంచనాలు ఫ్యాన్స్ లో ఉన్నాయి. దానికి కారణం మొదటి రెండు సినిమాలు ఫుల్ మాస్ లో సాగాయి. ఇక మూడవది వాటిని మించి ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే బాలయ్యలోని మాస్ మసాలా తగ్గించి క్లాస్ బాలయ్యని ప్రెజెంట్ చేయాలని బోయపాటి డిసైడ్ అయ్యాడట. వినయవిధెయరామ తో మాస్ యాక్షన్ పీక్స్ తీసుకువెళ్ళి ఫల్టీ కొట్టిన బోయపాటి బాలయ్య మూవీతో కొత్త జాగ్రత్తలు తీసుకుంటున్నారుట.


దీనికి తోడు బాలయ్యలో గతంలో ఎన్నడూ చూడని రొమాన్స్ యాంగిల్ కూడా ఈ మూవీతో చూపిస్తారని అంటున్నారు. నరకడం, కత్తులు, గొడ్డళ్ళు పట్టుకుని వేటాడ బాలయ్య పూబంతులతో చేసే సరసాలు, సరదాలు ఈ మూవీలో స్పెషల్ అట్రాక్షన్ అంటున్నారు.  బాలయ్య పక్కన ఇద్దరు అందాల ముద్దు గుమ్మలను బోయపాటి సెలెక్ట్ చేసే పనిలో ఇపుడు ఉన్నడని టాక్.  బాలయ్య, బోయపాటి మూవీలో వేరే ఏవో వూహించుకునే అభిమానులకు ఇది షాకింగ్ న్యూసే మరి.  చూడాలి ఎలా బాలయ్య లుక్ ఉంటుందో. ఎలా డిజైన్ చేశారో.

 



మరింత సమాచారం తెలుసుకోండి: