సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తాము అనుకున్న లక్ష్యాలను చేరుతున్నప్పుడు తన లైఫ్ స్టైల్ కు అనుగుణంగా అభిరుచులు మార్చుకోవాలి.  అది తప్పనిసరి.  అభిరుచులు మార్చుకొని ట్రెండ్ కు తగ్గట్టుగా ఫ్యాషన్ గా కనిపించాలి.  కొత్తకొత్త కార్లు కొనుగోలు చేయాలి.  పార్టీల్లో తళుక్కున మెరవాలి.  అలా చేస్తేనే మనుగడలో ఉంటారు.  నలుగురు కంట్లో పడతారు.  అవకాశాలు దక్కించుకుంటారు.  పెట్టిన డబ్బుకు నాలుగు రేట్లు డబ్బు సంపాదించుకుంటారు.  


ఈ విషయాలు సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరికి బాగా తెలుసు.  అందుకే అందరు అలానే మెయింటైన్ చేస్తుంటారు.  అలా మెయింటైన్ చేయడం కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు.  పెట్టుబడి పెడితేనే కదా డబ్బులు వచ్చేవి.  డబ్బులు పెట్టకుండా లాభం రావాలి అంటే కుదరదు.  హీరోల నుంచి దర్శకుల వరకు అందరు ఇప్పుడు కొత్త కొత్త లైఫ్ స్టైల్ కు అలవాటు పడ్డారు.  టాప్ రేంజ్ కార్లు కొంటున్నారు.  


ఈ కోవలోనే బాలీవుడ్ టాప్ దర్శకుడు రోహిత్ శెట్టి కూడా ఇటీవలే ఓ టాప్ రేంజ్ కారును కొనుగోలు చేశాడు.  దాని ముందు ఫోటో దిగాడు.  ఈ ఫోటోను సదరు కారు కంపెనీ ట్విట్టర్లో షేర్ చేసింది.  రోహిత్ శెట్టి కొనుగోలు చేసిన ఆ కారు ఖరీదు ఎంతో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు.  ఆ కారు ఖరీదు అక్షరాలా మూడు కోట్ల రూపాయలు.  బాప్ రే అంత ఖరీదు పెట్టి కారు కొనుగోలు చేయడం ఏంటి.. ఒక దర్శకుడు ఆ స్థాయిలో డబ్బుపెట్టి కారు కొన్నాడు అంటే అయన ఎంత సంపాదిస్తున్నాడో కదా.  


తెలివిని పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదించడం అంటే ఇదే.  టాలెంట్ ఉన్నది.  అయన టాలెంట్ ను నిరూపించుకున్నాడు.. ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు.  ఇంకో విషయం ఏమిటంటే.. రోహిత్ శెట్టి నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నాడు.  తెలుగులో హిట్టైన టెంపర్ సినిమాను రోహిత్ శెట్టి హిందీలో సింబాగా రీమేక్ చేశారు.  ఈ మూవీ అక్కడ కోట్లు కొల్లగొట్టింది.  వందలకోట్లు కొల్లగొట్టినపుడు..మూడు కోట్లు పెట్టి కారు కొనుగోలు చేయడంలో పెద్ద విషయం ఏముంది చెప్పండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: