త్రివిక్రమ్ కేవలం తన డైలాగ్స్  తో మాత్రమే కాకుండా తన ప్రవర్తనతో కూడ ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాడు. అందువల్లనే ఇండస్ట్రీలోని టాప్ హీరోలు అందరు త్రివిక్రమ్ ను అభిమానిస్తూ అతడితో సినిమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో నిన్న తన పుట్టినరోజున జరుపుకున్న త్రివిక్రమ్ ను అభినందిస్తూ ఎందరో హీరోలు నిర్మాతలు దర్శకులు తమ అభినందనలను సోషల్ మీడియా ద్వారా తెలియ చేసారు.

ఈ నేపధ్యంలో నిన్న మహేష్ త్రివిక్రమ్ పుట్టినరోజును పట్టించుకోకపోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి రోజున పుట్టినరోజును జరుపుకున్న కమలహాసన్ కు అభినందనలు తెలియ చేసిన మహేష్ త్రివిక్రమ్ పుట్టినరోజును మరిచిపోవడం హాట్ న్యూస్ గా మారింది. 

వాస్తవానికి ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ బిజీతో మహేష్ హడావిడిలో మరిచిపోయాడు అనుకుంటే తమిళ హీరో కమలహాసన్ గుర్తుకు ఉండి త్రివిక్రమ్ ను ఎలా మర్చిపోతాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. గత కొంతకాలంగా త్రివిక్రమ్ మహేష్ ల మధ్య కనిపించని గ్యాప్ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. 

గాసిప్పులకు మరింత బలం చేకూర్చే విధంగా నిన్న మహేష్ త్రివిక్రమ్ పుట్టినరోజునాడు ప్రవర్తించిన తీరు ఉంది అంటూ మరికొందరు మహేష్ ప్రవర్తన పై ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు. మహేష్ నటించిన సినిమాలలో రికార్డుల విషయం పక్కకు పెడితే ‘అతడు’ సినిమాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ తరువాత వీరిద్దరూ కలిసి ‘ఖలేజా’ మూవీ కోసం పనిచేసినా ఆ ప్రయోగం వికటించింది. ఆ తరువాత త్రివిక్రమ్ ఎన్నో కథలు మహేష్ కు వినిపించినా మహేష్ పెద్దగా ఆశక్తి కనపరచలేదు అని అంటారు. కేవలం ఒక్క ఫెయిల్యూర్ వల్ల మహేష్ త్రివిక్రమ్ ను పక్కకు పెట్టాడా లేదంటే వీరిద్దరి మధ్యా బయటకు రాని విభేదాలు మరేమైనా ఉన్నాయా అని గుసగుసలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: