అబ్బాయిలు కృత్రిమంగా అమ్మాయిల మారిన కానీ మగాళ్లు మృగాళ్ల వేధిస్తూనే ఉన్నారని జబర్దస్త్ కామెడీ షో కమెడియన్ ఇప్పుడు సాయితేజ ఒకప్పుడు చాలా స్కిట్స్ చేసిన సాయితేజ లేడీ గెటప్స్‌తోనే అందరిని ఆకట్టుకుని  పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఏకంగా అమ్మాయిగానే మారిపోయాడు.  ఆపరేషన్ చేయించుకుని సాయితేజ కాస్తా ప్రియాంకగా పేరు మార్చుకున్నాడు ఈయన.
సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిన తర్వాత తనను కూడా చాలా మంది వేధించారని ఇష్టమొచ్చినట్లు విమర్శలకు గురి చేసారని గుర్తు చేసుకున్నాడు. 

అతడు ఒక టీవీ ఇంటర్వ్యూ లో అతడు అనుభవించిన బాధలను పంచుకున్నాడు.  బుల్లితెరపై నవ్వించే వాళ్ళు ఎదో ప్రేక్షకులను నవ్వించడానికి వేసే వేషాలు కథలతో  బయట మాత్రం వివాదాల్లో ఇరుక్కుంటున్నారు అప్పట్ల శ్రీను ఎప్పుడు వినోద్ ఇలా ఎంతో మంది .ఇప్పటికే జబర్దస్త్ షో నుంచి వచ్చిన వాళ్లకు ఈ బాధలు  తెలుసు నని టీవిలో వాళ్లు చేసే కామెడీకి నవ్వుకుంటున్నా వాళ్ళు నిజజీవితం లో  మాత్రం చాలా బాధలు పడుతున్నారు అదే విషయం ఇలా అందరు చెప్పారని నేను కూడా  చెపుతున్నానని  సాయితేజ చెప్పింది.

ఇటీవల ఓకే దర్శకుడు కూడా చాల మూర్ఖంగా ప్రవర్తించాడని బాధపడింది. ఓ దర్శకుడు కలవాలని   రూమ్ కు పిలిచాడని అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయంది అలాగే మరో  దర్శకుడు ఫోన్ చేసి నువ్వు నా సినిమాలో ఐటం సాంగ్ చేస్తావా అని అడిగాడని వెంటనే తాను కూడా చేస్తానని చెప్పినట్లు గుర్తు చేసుకుంది ప్రియాంక. అయితే ఆ పాటలో కొంచం న్యూడ్ గా  చేయాల్సి వస్తుందని చెప్పాడని దానికి కూడా ఓకే అన్నట్లు చెప్పింది ప్రియాంక. ఈ పాటను వరంగల్‌లో షూట్ చేయాల్సి వస్తుందని అక్కడే మూడ్రోజులు ఉండాలని చెప్పాడని  అన్నీ సర్దుకుని తాను కూడా వరంగల్ షూట్ కోసం బయల్దేరుతున్న సమయంలో అదే దర్శకుడు కాల్ చేసి తనతో అసభ్యంగా మాట్లాడాడని చెబుతుంది ప్రియాంక.

తనతో మూడు రోజులు ఒకే రూమ్‌లో ఉండాలని ఆయనతో పాటు మరొకరు కూడా ఉంటారని చాలా నీచంగా మాట్లాడాడని చెప్పింది.దాంతో  విరక్తి చెందిన తను మీ రూమ్‌లో ఎందుకుండాలి నాతో పటు మా స్నేహితులు వచ్చారని వారితోనే ఉంటానని  తాను అలాంటి దాన్నైతే ఈ రోజు ఎక్కడో ఉండేదాన్ని కాదు అని  వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పింది ప్రియాంక. ఇంటర్వ్యూ  లో అతని పేరు అడిగితే  అన్నీ చెప్పినా  అసభ్యంగా ప్రవర్తించిన ఆ దర్శకుడి పేరు మాత్రం చెప్పలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: