సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తీసిన రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాగ్డ్రాప్ సినిమా రక్త చరిత్ర..రక్త చరిత్ర-2 తో తెలుగు తెరకు పరిచయమైంది బ్యూటి ఫుల్ హీరోయిన్ రాధికా ఆప్టే. వర్మ సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుంది. ఆ తర్వాత బోయపాటి శ్రీను-నందమూడి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ సినిమాతో ప్రేక్షకులకు ఇంకా దగ్గరయింది.అయితే ఈ సినిమా తర్వాత కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాధిక వరుసగా తెలుగులో అవకశాలు అందుకోవడంలో వెనకబడిపోయింది. కానీ మళ్ళీ బాలయ్య సరసనే లయన్ సినిమాలో మరోసారి నటించింది. బాలయ్య తో చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్టయినప్పటికి ఎందుకనో రాధిక ఆప్టే తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోలేకపోయింది.  

అయితే బాలీవుడ్ లో చేసిన లస్ట్ స్టోరీస్ తో మాత్రం ఓవరాల్ గా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. అంతేకాదు ఇండస్ట్రీ మీద, ఇండస్ట్రీ వాళ్ళ మీద వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసిన రాధిక బోల్డ్ క్యారెక్టర్స్ చేయడంలో మాత్రం అసలు ఆలోచించలేదు. వాస్తవంగా రాధికని చూసిన ఎవరైనా రెబల్ అని వివాదాలకి కేరాఫ్ అడ్రస్ అని అనుకునే అవకాశం లేదు. ఎందుకంటే రాధిక ఒక పద్దతైన మరాఠి కుటుంబం లో పుట్టి పెరిగింది. అసలు సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని కుటుంబం. రాధిక తండ్రి చారుదత్ ఆప్టే మహారాష్ట్ర అంతటా పేరున్న నరాల వైద్యుడు. అమ్మ జయశ్రీ ఆప్టే మత్తు మందు వైద్యనిపుణురాలు. రాధిక కి ఇద్దరు తమ్ముళ్ళు. కుటుంబంలో పెద్దదైన రాధిక లండన్‌లో డాన్స్ నేర్చుకుని స్టేజ్ ఆర్టిస్ట్ గా, తర్వాత మరాఠీ సినీ రంగానికీ ఆ తర్వాత హిందీ సినీ రంగానికీ పరిచయమయ్యింది. 

అమ్మా, నాన్న డాక్టర్స్ గా పేరున్న వాళ్ళైనప్పటికి తను మాత్రం న్యూడ్ ఆయాక్ట్రెస్ ఇండస్ట్రీలో ఫేమస్ అయింది. అయితే ఇప్పుడు రాధిక హాలీవుడ్ మీద ఫోకస్ చేస్తోంది. ఏకంగా జేంస్ బాండ్ సినిమాలలో నటించాలని ఆరాటపడుతోంది.  జేమ్స్ బాండ్ - ది స్టార్ వార్స్ లాంటి భారీ హాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్న రాధిక తనే సొంతంగా ఇంట్లో ఆడిషన్స్ చేసుకుని ఆ వీడియో క్లిప్పింగ్స్ ని హాలీవుడ్ చేరవేసింది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇప్పటికే న్యూడ్ సీన్స్ లో నటించి తనేంటో అందరికి తెలిసేలా చేసింది. దీన్ని బట్టి చూస్తే అమ్మడికి హాలీవుడ్ లో ఛాన్స్ రావడం అంత కష్ఠమేమి కాదని కొందరు అనుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: