మహేష్ బాబు హీరోగా 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పనులు శరవేగంగా సాగుతుండగా సంక్రాంతి కానుకగా మన ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి సందర్భంలో సినిమా పనుల్లో బిజీబిజీగా ఉన్న మహేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కమల్ హాసన్ పుట్టినరోజు వేడుక సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపాడు.

అలాగే ఇండస్ట్రీలో తనకెంతో సుపరిచితమైన, దగ్గరి స్నేహితులలో ఒకడైన అయినా వాళ్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకడు. ఇద్దరు కలిసి ' అతడు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన తరువాత 'ఖలేజా' లాంటి ఫ్లాప్ వచ్చినా మంచి స్నేహితులుగానే ఉన్నారు. అయిన అదేరోజు త్రివిక్రమ్ పుట్టినరోజు అయినప్పటికీ మహేష్ నుంచి ఎటువంటి స్పందన లేదు.

కానీ ఏళ్ళు గడిచేకొద్దీ వారి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. మధ్యలో కొన్నిసార్లు వీరిద్దరి కలయికలో ఒక సినిమా కోసం ప్రొడ్యూసర్లు ప్రయత్నించినా అవి కూడా ఫలించలేదు. మైత్రి మూవీ మేకర్స్ వారు మహేష్ మరియు త్రివిక్రమ్ తో చేసిన ఈ మధ్య చేసిన మూవీ ప్లాన్ కూడా వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఆ దూరం మరింత పెరుగుతూ వచ్చిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదు సరికదా వచ్చే సంక్రాంతికి రాబోయే మహేష్ 'సరిలేరు నీకెవ్వవరు' తో త్రివిక్రమ్ 'అలా వైకుంఠపురం లో' సినిమాలు ఒకే రోజున ఢీ కొట్టుకునే దాకా వచ్చింది. మహేష్ బాబు తన ఇగో తో కావాలని తన సినిమాని కూడా అదే రోజు విడుదలకి సిద్ధం చేశాడని సినీ వర్గాల్లో వినికిడి.

సోషల్ మీడియాలో కూడా ఇదే టాపిక్ చర్చగా మారి మహేష్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తనకు ఎంతో అప్పుడైన త్రివిక్రమ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపకపోవడం ఏంటి అంటూ నెటిజన్లు ఆశ్చరం వ్యక్తపరుస్తున్నారు. వీరిద్దరి కలహం ఎప్పటికి విడుతుందో, కలిసి ఎప్పుడు మూవీ తీస్తారో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: