భారతదేశ హీరోయిన్లు హాలీవుడ్ సినిమాల్లో నటించడం ఇప్పట్నుంచి కాదు.ఐశ్వర్యారాయ్ కాలం నుంచే మొదలైంది.ఆ తర్వాత ప్రియాంక చోప్రా కూడా నటించింది ఆమె అక్కడే సెటిల్ అయిపోయింది, ఆమెతో పాటు నటించిన దీపికా పదుకొనే కూడా హాలీవుడ్లో ప్రయత్నించింది, కానీ ఆమె అక్కడ సఫలం కాలేదు. ఇప్పుడు ఇదే దారిలో రాధికా ఆప్టే కూడా ప్రయత్నం చేస్తుంది.


 ఈమె కేవ‌లం న‌టిగా మాత్ర‌మే కాదు, ఎప్ప‌టిక‌ప్పుడు కాంట్రవ‌ర్సీల్లో నిలిచే పేరుగా కూడా గుర్తుకొస్తుంది. తెలుగులో బాలయ్య సరసన లెజెండ్, లయన్ లాంటి సినిమాలు చేసింది రాధిక ఆప్టే. ధోనీ,రక్తచరిత్ర లాంటి సినిమాలు చేసినా ఈమెకు ఇక్కడ ఇమేజ్ రాలేదు. ఇక ఎప్పటికప్పుడు ఏదో ఓ కొత్త సంచలనంతో ప్రేక్షకుల ముందుకొస్తుంది ఈమె. 

Image


 ఓ వైపు ఇండియన్ సినిమాలు చేస్తూనే మరోవైపు హాలీవుడ్‌లో కూడా నటిస్తుంది ఈ బ్యూటీ. ఈ మధ్యే "ది వెడ్డింగ్ గెస్ట్" సినిమాలో కూడా నటించింది రాధిక ఆప్టే. అందులో న్యూడ్ సీన్ కూడా చేసింది ఈ భామ. ఇక ఇప్పుడు ఈ భామకు హాలీవుడ్ నుంచి కూడా వరస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మరో రెండు సంచలన సినిమాల్లో నటించబోతుంది రాధిక. జేమ్స్‌ బాండ్‌ బ్రాండ్ నుంచి రాబోతున్న ఓ సీక్వెల్‌లో రాధిక పేరు వినిపిస్తుంది. మన ఇండియన్ హీరోయిన్లను కూడా ఇలాంటి పాత్రలకు తీసుకుంటున్నందుకు రుణపడిపోయాం అంటూ చెప్తుంది ఈ ముద్దుగుమ్మ. 


ఇక దాంతో పాటు స్టార్‌ వార్స్‌ సినిమాలో కూడా నటించబోతుంది ఈ భామ. ఈ సినిమాలో ఇలాంటి కారెక్టర్ చేయడానికి ఈ తరహా నటి కావాలని గిరి గీయకుండా తనలాంటి ఆర్టిస్టులను కూడా ప్రోత్సహిస్తున్నందుకు ఆనందంగా ఉందంటుంది రాధిక ఆప్టే. రాధికా ఇచ్చిన ఆడిషన్‌ నచ్చితే బాండ్‌ సినిమాతో పాటు స్టార్‌ వార్స్‌ సినిమాలోనూ ఈమె హీరోయిన్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: