విజయ్‌ దేవరకొండ ని హీరోగా ఒక క్రేజ్ తీసుకువచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు. అయితే పట్టుమని నాలుగు సినిమాలు కూడా డైరెక్ట్ చేయలేదు అప్పుడే దర్శకుడిగా బోర్ కొట్టిందో లేక హీరోగా స్టార్ ఇమేజ్ కావాలనుకున్నాడో గాని హీరోగా మొహానికి మేకప్ వేసుకున్నాడు. అయితే తనకు హిట్టిచ్చిన దర్శకుడిని హీరో చేయాలన్న విజయ్ తాపత్రయం ఏకంగా నిర్మాతగా మారేలా చేసింది. ఇక విజయ్ పేరు మీదే సినిమా సేల్‌ అయిపోతుందని అనుకున్నారు. కానీ 'మీకు మాత్రమే చెప్తా' సినిమాకి మరోసారి విజయ్‌ మార్కెటింగ్‌ ట్రిక్కులు అస్సలు పని చేయలేదు. తనే ఒక ప్రచార పాటని చేసి, కాళ్ళరిగేలా ప్రచారం చేసినా కానీ ఈ సినిమాని ప్రేక్షకులు మాకేమి చెప్పొద్దు అని నిర్మొహమాటంగా అనేశారు.

తొలి రోజే వీక్‌గా మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ జర్నీ ఆ తర్వాత కూడా అదే విధంగా సాగింది. విజయ్‌కి లాభాలు వచ్చినా కానీ థియేటర్‌ ఫీడింగ్‌కి కూడా ఈ సినిమా ఏమాత్రం ఉపయోగపడలేదు. కానీ విజయ్‌ మాత్రం ఏదో గొప్ప సినిమా తీసినట్టుగా గొప్పలు చెప్పుకోవాలని చూసాడు కానీ మరోసారి 'డియర్‌ కామ్రేడ్‌'వంటి డిజాస్టర్ నుంచి విజయ్ తప్పించుకోలేకపోయాడు. ఇక ఈ సినిమా తో పాటే రిలీజైన రవిబాబు 'ఆవిరి' సినిమా దర్శకుడిగా ఆవిరైపోయిన రవిబాబు అని మళ్ళీ నిరూపించింది.

ఈ సినిమాకి కనీసం పోస్టర్లు అతికించిన ఖర్చులు కూడా రాలేదని జనాలు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. సురేష్‌బాబుని వదిలేసి దిల్‌ రాజు దగ్గరికి చేరినప్పటికి ఈ ఆవిరి ఆడియన్స్‌కి పట్టలేదు. అయితే ఇక్కడ ఆశ్చర్యంగా తెలుగు సినిమాలు ఫ్లాప్‌ అయిన టైమ్‌లో తమిళ సినిమాలు సక్సెస్‌ ను అందుకొని తెలుగు హీరోలకి షాకిచ్చాయి. విజిల్‌ తెలుగులో బ్రేక్‌ ఈవెన్‌ కాగా, ఖైదీ మంచి లాభాలు తెచ్చుకుంది. ఈవారం శ్రీవిష్ణు సినిమా 'తిప్పరా మీసం'తో పాటు బూతు ప్రోమోలతో వైరల్‌ అయిన 'ఏడు చేపల కథ' కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. బూతు సినిమా జనాలతో బూతులు తిట్టించుకోగా శ్రీవిష్ణు మీసం తిప్పలేకపోయాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: