బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రియాల్టీ షో... బుల్లితెర ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరించిన షో. వంద రోజులు పైగా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ షో గత ఆదివారం తో ముగిసిపోయింది. ఎన్నో టాస్క్ లు, ఎలిమినేషన్ లు, నామినేషన్ల తో సెలెబ్రిటీలతో
బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయించారు బిగ్ బాస్.ఫైనల్ ఫైవ్ కి చేరుకున్న
బాబా భాస్కర్,
రాహుల్ సిప్లిగంజ్,
వరుణ్ సందేశ్,
శ్రీముఖి,
అలీ రజా ...ఇలా 5 గురు కంటెస్టెంట్స్ లో అందరూ ఎలిమినేట్ అవ్వగా రాహుల్ సిప్లిగంజ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 టైటిల్ గెలుచుకోగా... ఆ తర్వాత రన్నరప్ గా
శ్రీముఖి నిలిచింది. 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షోలో
రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు.
రాహుల్ సిప్లిగంజ్ కి
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 టైటిల్ ని అందజేశారు. అయితే
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో
విన్నర్ ని ప్రజల ఓట్ల ఆధారంగా డిసైడ్ చేశారు.
అయితే టైటిల్
విన్నర్ గా నిలిచిన
రాహుల్ సిప్లిగంజ్ కి 50 లక్షల రూపాయలు ప్రైస్ మని వచ్చింది. ఇదిలా ఉంటే టైటిల్
విన్నర్ గా గెలిచిన
రాహుల్ కి 50 లక్షల
ప్రైజ్ మని వచ్చినప్పటికీ టాక్స్ కట్ అయి కేవలం 36 నుంచి 37 లక్షలు మాత్రమే
రాహుల్ కి చేతికి అందాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా రన్నరప్ గా నిలిచిన
శ్రీముఖి ఎలాంటి
ప్రైజ్ మనీ గెలవకపోయినా....బిగ్ బాస్ శ్రీముఖికి ఇచ్చిన రెమ్యునరేషన్ మాత్రం రాహుల్ కి అందనంత దూరంలో ఉన్నట్టు సమాచారం. బిగ్ బాస్ లో ఉన్న వంద రోజులకు గాను
శ్రీముఖి 3.5 కోట్లు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికితోడు
శ్రీముఖి కి స్పాన్సర్ షిప్ లు కూడా తోడవడంతో
రాహుల్ తో పోల్చితే శ్రీముఖి ఆదాయం అందనంత దూరంలో ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా... బిగ్ బాస్ తెలుగు సీసన్ 1 కి జూనియర్
ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి
బిగ్ బాస్ షో ని ఒక రేంజ్ లో పాపులర్ చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో నాచురల్ స్టార్
నాని వ్యాఖ్యాతగా వ్యవహరించినప్పటికీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాడు.అంతేకాకుండా బిగ్బాస్ తెలుగు సీజన్ 2 ఎక్కువగా ప్రేక్షకులు ఆకర్షించకపోవడానికి
హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ కూడా ఒక కారణమని చెప్పాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 మాత్రం అంతగా ప్రేక్షకాదరణ మాత్రం పొందలేకపోయింది. ఇక
నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు సీసన్ 2 బుల్లితెర ప్రేక్షకులను ఆదరిస్తూ టాప్ రేటింగ్ దూసుకుపోయింది. నాగార్జునకు ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు చేసిన అనుభవం ఉండడంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 షో లో అదరగొట్టాడు.