మళయాలంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన లూసిఫర్ చిత్రానికి పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఈమూవీలో మోహన్ లాల్ అద్భుత నటనకు ప్రశంసలందాయి. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి హీరోగా ఐతే చక్కగా సెట్ అవుతారని చాల మంది సినీ ప్రేమికుల అభిప్రాయం. అందుకే తెలుగు లో ఈ రీమేక్  చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారన్న అంశంపై సుకుమార్ పేరు ని మొదట పరిశీలించారట మెగా ఫామిలీ.   


 'రంగస్థలం' బ్లాక్ బస్టర్ అయిన దగ్గర నుంచి మెగా ఫ్యామిలీతో సుకుమార్‌కి సాన్నిహిత్యం ఏర్పడిన సంగతి తెలిసిందే. పైగా, రామ్ చరణ్ సెంటిమెంట్ ప్రకారం సుకుమార్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గతంలోనూ  సుకుమార్ చిరంజీవి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారనే టాక్ నడిచింది. కానీ  సుకుమార్ కి అప్పగించాలని చరణ్ ఆయనని సంప్రదించగా... ఈ మెగా ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారట సుకుమార్.


ఐతే తాను రాసుకున్న కథలను మినహా రీమేక్ చిత్రాలు చేయని సుకుమార్ ఈ మెగా ఆఫర్ ని వదులుకునట్టు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ ప్రస్తుతం బన్నీ 20వ చిత్రగా  ఓ క్రైమ్ డ్రామాగా తెరకెక్కనున్న సినిమా  ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు.  త్వరలోనే వీరి మూవీ సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో బన్నీ సరసన హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుంది. కాగా ఈ మూవీ అనంతరం చరణ్ సుకుమార్ తో ఓ మూవీ చేయాలని భావించారట. 


 దీనితో మరో దర్శకుడికి ఈ మూవీ అప్పగించాలని చూస్తున్నారట రామ్ చరణ్.  ఇక రామ్ చరణ్ నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ ఇటీవలే ప్రారంభమైంది.  సమకాలీన పరిస్థితులకు సంబందించిన సోషల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: