రాజా ది గ్రేట్ తర్వాత మూడు వరుస ఫ్లాపులు చవిచూసిన మాస్ మహరాజ్ రవితేజ సినిమాల సెలక్షన్ విషయంలో జగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం వి.ఐ ఆనంద్ డైరక్షన్ లో డిస్కో రాజా సినిమా చేస్తున్న రవితేజసినిమా తరవాత గోపిచంద్ మలినేని సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ముహుర్త కార్యక్రమాలు కూడా జరిగాయి.


సినిమా కథ గురించి సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ నడుస్తుంది. సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. అయితే రవితేజ పోలీస్ అనగానే తమిళ హీరో విజయ్ తెరి సినిమానే తెలుగులో రీమేక్ చేస్తున్నారని అంటున్నారు. అయితే దీనిపై దర్శకుడు మలినేని గోపిచంద్ క్లారిఫై చేశాడు.


సినిమా రీమేక్ కాదని.. రియల్ స్టోరీతో తెరకెక్కుతుందని అన్నాడు గోపిచంద్. ఆల్రెడీ రవితేజతో డాన్ శీను సినిమా చేశాడు గోపిచంద్ మలినేని సాయి ధరం తేజ్ విన్నర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రవితేజతో సినిమా చేస్తున్నాడు. రెండేళ్లు సరైన కథ కోసం వెతిక గోపిచంద్ ఫైనల్ గా కత్తి లాంటి కథతో ఈ సినిమా చేస్తున్నాడట.


గోపిచంద్ చెప్పిన కథ రవితేజకు నచ్చడంతో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. తప్పకుండా మరోసారి ఈ ఇద్దరి హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. రవితేజ డిస్కో రాజా హిట్ అయితే ఆ ఫాం లోనే ఈ సినిమతో కూడా బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టేలా ఉన్నాడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్న ఈ సినిమా 2020 దసరా బరిలో దించే అవకాశాలు ఉన్నాయట. తను ఫాం లో లేకపోవడంతో యువ హీరోలు తమ సత్తా చాటుతున్నారు. అర్జెంట్ గా హిట్టు కొట్టి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు మాస్ రాజా రవితేజ.


మరింత సమాచారం తెలుసుకోండి: