మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150 మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  అప్పట్లో మెగాస్టార్ పై ఎన్నో రూమర్లు వచ్చాయి.  కానీ ఖైదీ నెంబర్ 150 తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ మూవీతో అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఈ మూవీకి రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించారు.  అయితే ఈ మూవీ అనుకున్నంత గొప్పగా రిజల్ట్ రాలేదు.  

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు.  ఈ మూవీ దేవాలయకు సంబంధించిన మాఫీయా గురించి రూపొందబోతుందట.  కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాని మ్యాట్ని ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి జిమ్ లో చాలా కసరత్తులు చేస్తున్నాడు. ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ కొడుకైన కొణిదెల శివశంకర వరప్రసాద్  నటుడిగా మారి స్వయం కృషితో మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగారు. యువ హీరోల హవా నడుస్తున్న ప్రస్తుత కాలంలో  సైరా నరసింహారెడ్డిలో నటించి హిట్ అందుకున్నారు.


64 సంవత్సరాలు ఉన్న చిరు తన తదుపరి సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడు. ఈ వయసులో చిరు జిమ్‌కి వెళ్లి వర్కౌట్స్ చేయడాలు, కండలు పెంచడాలు చాలా కష్టం. కానీ సినిమా పైన ఉన్న డెడికేషన్ తో చిరు ఇలా కష్టపడుతున్నాడు.  ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ నుంచి సామాజిక కార్యకర్తగా మారిన ఒక నడివయస్కుడి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. జిమ్ లో చిరంజీవి డంబెల్స్ ఎత్తుతోన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. చిరంజీవి దేవాదాయ ధర్మదాయ శాఖకి సంబంధించిన ఉద్యోగిగా కనిపించనున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇందులో చిరంజీవి డబల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: