తెలుగు సినిమాను నెంబర్ వన్ హీరోగా అప్రతిహతంగా ఏలుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సైరాతో మంచి విజయాన్ని అందుకుని ఈ జనరేషన్ హీరోలకు సవాల్ విసురుతున్నాడు. దాదాపు మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. ఈ విజయంతో తన మునుపటి మెగాస్టార్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. యాక్షన్, డ్యాన్స్ గ్రేస్ ను ఖైదీ నెంబర్ 150 నిరూపిస్తే, శక్తివంతమైన పాత్రను తన నటనతో ఏస్థాయికి తీసుకెళ్లగలడో సైరా నిరూపించింది.

 


64ఏళ్ల వయసులో చిరంజీవి పడిన కష్టానికి ప్రేక్షకులు ముగ్దులైతే అభిమానులు పరవశించిపోయారు. యాంటీ ఫ్యాన్స్ తప్ప సైరాలో చిరంజీవి నటనను మెచ్చుకోని వారు లేరు. ఇప్పుడు తన 152వ సినిమాకు ప్రిపేర్ అవుతున్నడు మెగాస్టార్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభమై వేగంగా పూర్తికానుంది. 2020 సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం చిరంజీవి తనకు ఇష్టమైన కష్టాన్ని మాత్రం వదులుకోవడం లేదు. బాడీ షేప్ కోసం ఈ వయసులో కూడా జిమ్ లో వయసుకు తగ్గ కసరత్తులు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. డంబెల్ ను ఎత్తుతూ ఉన్న ఆ స్టిల్ ను చూసి మెగా అభిమానులు పరవశించిపోతున్నారు.

 


చిరంజీవి ఏ సినిమానైనా మనసుపెట్టి చేస్తాడు అనేది ఎవరికైనా తెలిసిన విషయమే. ఇంద్ర కోసం చిరంజీవి పడిన కష్టాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అప్పట్లో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఖైదీ నెంబర్ 150, సైరాకు అంతే కష్టం చేశాడని చరణ్, సురేందర్ రెడ్డి అన్నారు. ఈ స్టిల్ చూస్తే చిరంజీవి డెడికేషన్ ఏస్థాయిలో ఉంటుందో అర్ధమవుతోంది. దర్శకుడు తేజ అన్నట్టు.. ‘ఊరికే అయిపోరు మరి.. మెగాస్టార్లు’.

 


మరింత సమాచారం తెలుసుకోండి: