బాలక్రిష్ణ సినిమాల్లో ఎంతో రౌద్రంగా కనిపిస్తారు. ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువగా  ఫైర్ బ్రాండ్ మూవీసే ఉంటాయి. ఇక బయట కూడా బాలయ్య అలాగే ఉంటారని అపోహలు ఉన్నాయి. కానీ బాలయ్యకు ఆ మనిషి నచ్చాలి. నచ్చితే చిన్న పిల్లాడైపోతారు. అభిమానం చూపిస్తారు. అయితే బాలయ్య మూడ్స్ ని అర్ధం చేసుకోని వారు మాత్రం ఆయన ఫైర్ అంటూంటారు. ఇవన్నీ ఎలాగున్నా బాలయ్యతో అందరూ స్నేహం చేస్తారు. అందరితోనూ బాలయ్యకు గుడ్ రిలేషన్లు ఉన్నాయి.


ఇక బాలయ్య  తన సినిమా ఒక్కసారి అనుకుని  రిలీజ్ అంటే దానికి కట్టుబడిపోతారు. ఒక్కసారి డేట్ అనౌన్స్ చేస్తే ఇక వెనక్కి తగ్గరు. అలాగే ఇపుడు రూలర్ సినిమాని ఆయన సంక్రాంతి బరిలో నుంచి డిసెంబర్ కి 20 కి తెచ్చేశారు. దాంతో ఆ రోజున రిలీజ్ కావాల్సినవి, అటూ ఇటూ ఉన్న సినిమాలు ఇపుడు గొప్ప టెన్షన్ పడుతున్నాయి. ముఖ్యంగా రవితేజా మూవీ డిస్కో రాజా ఉంది. అది మొదట డిసెంబర్ 20 అనుకున్నారు.


బాలయ్య రూలర్ కంఫర్మ్ కావడంతో రవితేజా మూవీ పోటీగా రిలీజ్ కొట్టడం ఎందుకని జనవరి 24కి వాయిదా వేసుకున్నారు. ఇక నితిన్ భీష్మ‌ సినిమా కూడా క్రిస్మస్ టార్గెట్ గా రెడీ చేసి పెట్టుకున్నారు, అయితే పోటీ డిసెంబర్లోనే  మొదలు కావడంతో ఆ మూవీని కూడా ఫిబ్రవరి లోకి తీసుకెళ్ళిపోయారు.


ఇక వెంకీ మామ మూవీని కూడా ముందుకు తెచ్చేస్తున్నారు. అంటే డిసెంబర్ మొదటి రెండు వారాల్లోనే ధియేటర్లో బొమ్మ పడిపోతుందన్న మాట. ఇక మిగిలింది మెగా మేనల్లుడు సాయి తేజ్ మూవీ ప్రతి రోజు పండుగ. ఈ మూవీ, రూలర్ మాత్రమే  ఇపుడు పోటీలో ఉన్నాయి. మరి ప్రతి రోజు పండుగ కూడా ముందుకు వెనక్కి జరుగుతుందేమో చూడాలి. మొత్తానికి రూలర్ అన్న టైటిల్ కాదు కానీ బాలయ్య డిసెంబర్ ని రూల్ చేసేశారు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: