ఎంపీ గ‌ల్లా జ‌య్‌దేవ్‌, గ‌ల్లా ప‌ద్మ‌ల త‌న‌యుడు అశోక్. సూప‌ర్ స్టార్ మ‌హేష్ మేన‌ల్లుడు.  ఇటీవ‌లె అశోక్ హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో ఓ చిత్రం ప్రారంభ‌మై కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. `ఆడు మగడ్రా బుజ్జి` ఫేం కృష్ణారెడ్డి దర్శకత్వం వహించాల్సి ఉండగా.. స్క్రిప్టు విషయంలో మహష్ సంతృప్తిగా లేక పోవడంతోనే ఆ సినిమా ఆగి పోయినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. మేనల్లుడు కోసం మహేష్  చాలా కథలు విన్నాడు. కానీ అవేవీ నచ్చలేదు. తాజాగా శమంతక మణి దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చెప్పిన స్టోరీ కనెక్టయ్యింది. ప్రస్తుతం మేనల్లుడి నిర్మాత కూడా మారారు. దిల్ రాజ్ స్థానంలో పద్మ గల్లా వచ్చి చేరారు.


మహేష్ అక్క.. అశోక్ తల్లి గారైన పద్మ గల్లా  త‌న కొడుకు కోసం ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. శనివారం  ఈ సినిమా హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభం కానుంది. దీంతో అశోక్ ఎంట్రీ పై పూర్తి క్లారిటీ వచ్చింది. మేనల్లుడి విషయంలో మహేష్ పెద్ద ఎత్తున ప్రక్షాళన చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడిని మార్చాడు. నిర్మాతగా త‌న అక్క‌ను రంగంలోకి దింపాడు. తనయుడి సినిమా తోనే తల్లిని నిర్మాతగా పరిచయం చేస్తున్న క్రెడిట్ మహేష్ కే దక్కుతుంది. కావాలనుకుంటే మహేష్ బాబు సొంత బ్యానర్ ఎంబీ ప్రొడక్షన్స్ లో అశోక్ ని లాంచ్ చేయగలడు. మేనల్లుడికి  కావాల్సిన  బూస్ట్ ఇవ్వగలడు. కానీ అలా చేయలేదు. సొంత అక్కనే బరిలోకి దించడమే ఇక్కడ ఆసక్తిని కలిగిస్తోంది.


అంటే భవిష్యత్ లో పద్మ నిర్మాతగా కొనసాగే అవకాశాలు లేకపోలేదు. బ్యాక్ ఎండ్ లో  మహేష్-నమ్రతల సపోర్ట్ కూడా ఉంటుంది కాబ్టటి పద్మకు సినీనిర్మాణం పరంగా పనులు సులభం అయ్యే అవకాశం ఉంది. గల్లా పద్మ అనధికారికంగా బిజినెస్ ఉమెన్ అన్న సంగతి తెలిసిందే. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఈ మ‌ధ్య సినీ రంగంలోకి ఎవ‌రైనా ఒక‌రు ఉంటే చాలు మిగ‌తా వాళ్లంతా ఫ్యామిలీ ప్యాక్‌లాగా ఒకొక్క‌ళ్లు ఒక్కోరంగంలో అడుగుపెట్టేస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ, చిరంజీవి ఫ్యామిలీ, నాగార్జున ఫ్యామిలీ, వెంక‌టేష్ ఫ్యామిలీ బాల‌య్య ఫ్యామిలీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. మ‌రి వాళ్ళ‌లో కొంత మంది హిట్ అవుతున్నారు. కొంత మందికి ఆశించినంత‌గా పేరు రాదు. ఇదిలా ఉంటే ఇలా ఇండ‌స్ట్రీ మొత్తం వీళ్ళే స‌రిపోతే మ‌రి కొత్త‌గా వ‌చ్చేవాళ్ళ‌కి అవ‌కాశాలు రావ‌డం కాస్త క‌ష్ట‌మే అన్న మాట‌లు కూడా వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: