మెగాస్టార్ చిరంజీవిసైరా సక్సెస్ అవ్వడంతో ఇప్పడు మరో సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమాకు సక్సెస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మొన్న పూజ కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ రెండో వారంలో పట్టాలెక్కించబోతున్నారట. ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు అన్న విషయం తెలియాల్సి ఉంది. కొరటాల శివ చరణ్సినిమా ను తెరకెక్కిస్తున్నారు. 


కొరటాల శివ సినిమా అంటేనే అందులో కమర్షియల్ అంశాలతో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా కథ కూడా అలాంటిదే అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ కథలో నక్సలైట్ నుంచి సామాజిక కార్యకర్తగా మారిన ఆచార్య అనే వ్యక్తి పాత్రలో చిరంజీవి కనిపించనున్నారని టాక్.


ఇకపోతే తాజాగా ఈ సినిమాకు  టైటిల్ కూడా ఖరారు చేశారు. అయితే అందుతున్న సమాచారం ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ‘గోవింద హరి గోవింద’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. దేవాదాయ శాఖలో జరుగుతోన్న అక్రమాల చుట్టూ తిరిగే సినిమా ఇదని ఇప్పటికే బయటికి వచ్చిన సమాచారం. ఈ సినిమాలో చిరు ముందు లాగ కనిపించబోతున్నాడని అర్థమవుతుంది. 


రీ ఎంట్రీ తరువాత చిరు ఛీనిమాల్లో జోష్ లేదని ఫ్యాన్స్ వెల్లడించడంతో.. ఫీల్ అయినా చిరు ఇప్పుడు చేస్తున్న సినిమా ఫ్యాన్స్ కు నచ్చేలా ఉండాలని ఏరి కోరి మరి ఈ కథను ఎంచుకున్నాడు. ఇక ఈ సినిమాను  మేట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైన్‌ను హ్యాండిల్ చేస్తున్నారు. హీరోయిన్‌ను ఫైనల్ చేయాల్సి ఉంది. ఇకపోతే ఎవరు సంగీతాన్ని అందిస్తారో తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: